కరోనా వ్యాక్సినేషన్ లో మరో ముందడుగు..12-14 ఏళ్ల పిల్లలకు టీకా..ఎప్పటి నుండి అంటే?

0
101

దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతా ఇంతాకాదు. ఈ రాకాసి మహమ్మారి మూడు వేవ్ లలో ఎన్నో ప్రాణాలను బలి తీసుకుంది. ఈ మహమ్మారి ఆడ్డుకట్టకు ఉన్న అస్త్రాలు మాస్క్ ఒకటి కాగా మరొకటి వ్యాక్సిన్. వ్యాక్సినేషన్ లో భాగంగా దేశంలో ఇప్పటికే ఫస్ట్, రెండో డోస్ లు దాదాపు పూర్తి కావొచ్చాయి.

దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం 2020 జనవరి 16న ప్రారంభం అయింది. జనవరి 16 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇవ్వడం మొదలైంది. 2020 మార్చి 1 నుంచి వ్యాధిగ్రస్తులు, వృద్దులకు టీకాలు ఇవ్వడం ప్రారంభించారు. 2020 ఎప్రిల్ 1 నుంచి దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించారు. 2020 మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారందరికి టీకాలు ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలో కరోనా టీకా పంపిణీలో మరో ముందడుగు పడనుంది. తాజాగా ఈనెల 16 నుంచి 12-14 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యమంత్రి మాన్​సుఖ్​ మాండవీయా వెల్లడించారు. 60 ఏళ్ల పైబడిన అందరికీ ‘ప్రికాషన్​ డోసు’ అందించనున్నట్లు స్పష్టం చేశారు.