తెలంగాణ: వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్ కలకలం రేపుతోంది. దుగ్గొండి మండలం చాపలబండ గ్రామంలో గొర్రెలకు ఆంత్రాక్స్ వ్యాధి సోకినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. తదుపరి పరీక్షల కోసం నమూనాలు హైదరాబాద్‌కు పంపించినట్లు అధికారులు వెల్లడించారు.
ఇప్పటివరకు 4 గొర్రెలు మృతి చెందగా. గ్రామంలోని మరో 12 వందల గొర్రెలకు వైరస్ వ్యాప్తి చెందకుండా టీకాలు వేస్తున్నారు. ల్యాబ్ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని..ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెటర్నరీ అధికారులు వెల్లడించారు.