అంత్యక్రియలకు వెళ్లినా శవం ముట్టుకున్నా కరోనా వస్తుందా?

అంత్యక్రియలకు వెళ్లినా శవం ముట్టుకున్నా కరోనా వస్తుందా?

0
83

ఈ మధ్య చాలా మంది తమ బంధువులు కన్నవారు దూరం అయిన సమయంలో వారి అంత్యక్రియలకు వెళ్లిన సమయంలో వారిని ముట్టుకుంటే కరోనా వస్తుంది అని భయంతో వారి దగ్గరకు వెళ్లడం లేదు, ఇలాంటి పరిస్దితి ఎవరికి రాకూడదు, కాని ఈ దురదృష్ట సమయంలో ఇలాంటి పరిస్దితి చాలా మందికి వస్తుంది.

అయితే శవం ద్వారా కరోనా వ్యాపిస్తుందని నమ్మి కొంతమంది అంత్యక్రియలకు కూడా దూరంగా ఉంటున్నారు. కరోనా ప్రధానంగా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడేటప్పుడు చిమ్మే తుంపరల ద్వారా వ్యాపించే వైరస్ ఆ సమయంలో ఇది మరింత వేగంగా వస్తుంది అని చెబుతున్నారు.

మృతదేహాల నుంచి కరోనా వ్యాప్తికి దాదాపు అవకాశాలు లేవని అభిప్రాయపడుతున్నారు. ఇక శవం దగ్గర సమయం అయ్యే కొద్ది మృతదేహంలో వైరస్ మనుగడ సాగించే శక్తిని క్రమంగా కోల్పోతుందని చెబుతున్నారు..ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం మార్చురీ బ్యాగ్ జిప్ను ముఖం వరకు తీయవచ్చు. కుటుంబ సభ్యులు, బంధువులు చివరిసారి చూసి నివాళులు అర్పించవచ్చని అంటున్నారు, అయినా జాగ్రత్త ఉండాలి కాబట్టి తాకద్దు అని చెబుతున్నారు నిపుణులు.