ఏపీలో తగ్గిన కరోనా ఉధృతి..హెల్త్ బులెటిన్ రిలీజ్..కొత్త కేసులు ఎన్నంటే?

0
46

ఏపీలో కరోనా కల్లోలం కాస్త తగ్గింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపుతుండగా తాజాగా కేసుల సంఖ్య తగ్గడం భారీ ఊరట కలిగిస్తుంది. తాజాగా ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 25,284 సాంపిల్స్ పరీక్షించగా..5879 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 22,73475 చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది.

అలాగే ఒక్కరోజు వ్యవధిలో మరో తొమ్మిది మంది కరోనా బారిన పడి మరణించారు.  ఇక గడిచిన 24 గంటల్లో 11384 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.  నేటి వరకు రాష్ట్రంలో 3,24,70,712 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

కాగా గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

అనంతపురం  856

చిత్తూరు         295

ఈస్ట్ గోదావరి   823

గుంటూరు  421

వైస్సార్ కడప  776

కృష్ణ   650

కర్నూల్  483

నెల్లూరు   366

ప్రకాశం    321

శ్రీకాకుళం 80

విశాఖపట్నం  340

విజయనగరం 12

వెస్ట్ గోదావరి   456