ఏపీ కరోనా బులెటిన్ రిలీజ్..లక్ష దాటిన యాక్టివ్‌ కేసులు..మరణాలు ఎన్నంటే?

AP Corona bulletin cases..active cases exceeding one lakh

0
146

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన రేపుతోంది.  తాజాగా ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,819 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 22,08, 955కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది.

అలాగే ఒక్కరోజు వ్యవధిలో మరో 12 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 561 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 101396 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 5716 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.

కాగా గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

అనంతపురం  1345

చిత్తూరు         436

ఈస్ట్ గోదావరి   1001

గుంటూరు  1422

వైస్సార్ కడప  1083

కృష్ణ   748

కర్నూల్  1255

నెల్లూరు   1305

ప్రకాశం    1589

శ్రీకాకుళం 568

విశాఖపట్నం  1988

విజయవాడ   435

వెస్ట్ గోదావరి   644