దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. రోజురోజుకు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశంలో మూడో వేవ్ మొదలైందనే భయం కలుగుతుంది.
ఏపీలో గడిచిన 24 గంటల్లో 47,884 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..4,348 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా రక్కసి ఇద్దరిని బలి తీసుకుంది. కృష్ణా, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు కోవిడ్‌తో చనిపోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,89,332కి చేరగా.. ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,507గా ఉంది.
కాగా.. గత 24 గంటల్లో 261 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 20,60,621 కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 14,204 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.
కాగా గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.
అనంతపురం 230
చిత్తూరు 932
ఈస్ట్ గోదావరి 247
గుంటూరు 338
వైస్సార్ కడప 174
కృష్ణ 296
కర్నూల్ 171
నెల్లూరు 395
ప్రకాశం 107
శ్రీకాకుళం 259
విశాఖపట్నం 823
విజయవాడ 290
వెస్ట్ గోదావరి 86