ఏపీ కరోనా బులెటిన్ రిలీజ్..జిల్లాల వారిగా కేసుల వివరాలివే

AP Corona Bulletin Release .. District wise details of cases

0
125

ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరగడం కలకలం రేపుతున్నాయి. తాజాగా ఏపీ వ్యాప్తంగా 30,578 కరోనా పరీక్షలు చేయగా.. కేవలం కొత్తగా 4605 కేసులు నమోదయ్యాయి.  ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. కోవిడ్ వల్ల అనంతపురం, కడప. కర్నూలులలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం మరియు విజయనగరంలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

దీంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 641 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 93488 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 11,729 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2185042 లక్షలకు చేరింది. ఇప్పటి దాకా 3,25,71,365 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

గడిచిన 24 గంటల్లో జిల్లాల వారిగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

అనంతపురం  218

చిత్తూరు         290

ఈస్ట్ గోదావరి   642

గుంటూరు  524

వైస్సార్ కడప  413

కృష్ణ   477

కర్నూల్  318

నెల్లూరు   501

ప్రకాశం    342

శ్రీకాకుళం 105

విశాఖపట్నం  219

విజయనగరం 17

వెస్ట్ గోదావరి   539