కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. గతంలో కరోనా కట్టడికి చేపట్టిన లాక్‌డౌన్, ఇతర ఆంక్షల కారణంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొత్త వేరియంట్‌తో పాటు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది.
ఇక తాజాగా ఏపీలో కూడా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 38,055 శాంపిల్స్ ని పరీక్షించగా 6,996 మందికి కరోనా సోకినట్లు తేలింది. కొత్తగా కోవిడ్ మహమ్మారితో నలుగురు ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14514కు చేరింది.
ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 36108 యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా 24 గంటల వ్యవధిలో 1,066 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2066762కి చేరింది. నేటి వరకు రాష్ట్రంలో 3,19,22,969 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. కాగా విశాఖ, చిత్తూరు జిల్లాలో వెయ్యికి పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది.
కాగా గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.
అనంతపురం 462
చిత్తూరు 1534
ఈస్ట్ గోదావరి 292
గుంటూరు 758
వైస్సార్ కడప 202
కృష్ణ 326
కర్నూల్ 259
నెల్లూరు 246
ప్రకాశం 424
శ్రీకాకుళం 573
విశాఖపట్నం 1263
విజయవాడ 412
వెస్ట్ గోదావరి 245