దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. రోజురోజుకు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశంలో మూడో వేవ్ మొదలైందనే భయం కలుగుతుంది.
తాజాగా ఏపీలోనూ కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 3,205 మంది కరోనా బారిన పడ్డారు. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 695 కేసులు నమోదు కాగా.. కడప జిల్లాలో అత్యల్పంగా 42 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 281 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 20,87,879కి చేరుకుంది. ఇప్పటి వరకు కరోనా నుంచి 20,63,255 మంది కోలుకోగా… 14,505 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,119 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కాగా గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.
అనంతపురం 160
చిత్తూరు 607
ఈస్ట్ గోదావరి 274
గుంటూరు 224
వైస్సార్ కడప 42
కృష్ణ 217
కర్నూల్ 123
నెల్లూరు 203
ప్రకాశం 90
శ్రీకాకుళం 268
విశాఖపట్నం 695
విజయవాడ 212
వెస్ట్ గోదావరి 90