ఏపీలో ఆ జిల్లా యువకుడికి కరోనా పరుగులు పెట్టిన అధికారులు….

ఏపీలో ఆ జిల్లా యువకుడికి కరోనా పరుగులు పెట్టిన అధికారులు....

0
84

ఇటీవలే హైదరాబాద్ ను భయబ్రాంతులకు గురి చేసిన కరోనా వైరస్ ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా ప్రజలను కూడా భయ బ్రాంతులకు గురి చేస్తోంది.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి హైదరాబాద్ లో ఒక కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు…

ఇటీవలే దక్షిణ కొరియాకు వెళ్లి తిరిగి హైదరాబాద్ వచ్చిన ఆయన ఆ తర్వాత తన స్వగ్రామంకు చేరుకున్నారు… విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన హైదరాబాద్ అధికారులు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కు సమాచారం అందించారు..

ఆయన వెంటనే వైద్యులకు సమాచారం అందించారు… దీంతో రంగంలోకి దిగిన వైద్యులు సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉన్న స్థలానికి చేరుకున్నారు… ఇప్పుడు ఆయనకు కరోనా ఉందా లేదా అనేది వైద్యులు నిర్దారించాల్సి ఉంది…