ఈగలు చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఓ పక్క కూర్చున్నా మన దగ్గరకు వస్తాయి. ఏదైనా తింటున్నా మన కంటే ముందే అవి టేస్ట్ చేస్తాయి. దీంతో ఆ ఫుడ్ కూడా తినాలనిపించదు. ఈగల మోత దారుణంగా ఉంటుంది. నిశ్శబ్దంలో కూడా ప్రశాంతంగా ఉండనివ్వవు. చూడటానికి చిన్నగా ఉన్నా ఈ ఈగలు, దోమలు చాలా రకాల జబ్బులు అంటిస్తాయి.
ముఖ్యంగా ఈగల కారణంగా కలరా, విరేచనాలు, టైఫాయిడ్ అతిసారం వంటి వ్యాధులు వస్తాయి. కచ్చితంగా ఇళ్లు పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే ఈగలు రాకుండా ఉంటాయి. చెత్త ఉన్నా, నీరు ఉన్నా, మురికి ఉన్నా అక్కడ ఈగలు ఉంటాయి. ఇక మొక్కలు, పాదులు ఉంటే అక్కడ కూడా వాలతాయి . మరి ఈగల సమస్య పోవాలంటే ఏం చేయాలి అనేది తెలుసుకుందాం.
1. కర్పూరం మీరు రూమ్ లో వెలిగించి డోర్ క్లోజ్ చేయండి ఆ వాసనకు ఈగలు దోమలు వెళ్లిపోతాయి.
2. తులసి చెట్టు పెరటిలో ఉంచితే పెరటిలో ఈగలు రావు.
3. కారం కలిపిన నీటిని డబ్బాలో పోసి ఇంటి చుట్టు స్ప్రే చేయండి. ఆ వాసనకు ఈగలు రావు.
4.ఒక బౌల్ లో ఆపిల్ సైడర్ వెనిగర్ పోసి ఉంచితే అక్కడకు ఈగలు వాలవు.