దోమలను చంపడానికి మస్కిటో కాయిల్స్‌ వాడుతున్నారా? అయితే మీరు రిస్క్ లో పడ్డట్టే..

0
100

సాధారణంగా అందరి ఇళ్లల్లో దోమలు ఉంటాయి. అయితే అవి కుడితే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వాటిని ఇంట్లో నుంచి తరిమికొట్టడానికి మస్కిటో స్ప్రే, కాయిల్స్‌ వంటివి వాడుతుంటారు. అయితే వీటిని వాడడం వల్ల కొందరికి తలనొప్పి వస్తే..మరికొందరికి ఇట్టే నొద్రొస్తుంది. దానికి అర్ధం త్వరలో హానికర వ్యాధులు వస్తాయని మనం గమనించుకోవాలి. ఎందుకో మీరు కూడా చూడండి..

దోమలను చంపే మస్కిటో కాయిల్స్ శరీరానికి చాలా హానికరం అని నిపుణులు చెబుతున్నారు. కాయిల్స్ హానికరమైన రసాయనాలను విడుదలయి పరిసరప్రాంతాలకు వ్యాపిస్తుంది. దీనిని మనం పీల్చుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.  ప్రతి మస్కిటో కాయిల్ 75 కంటే ఎక్కువ సిగరెట్లను ఉత్పత్తి చేస్తుంది. కావున ఈ వాసనను పీల్చుకోవడం వల్ల శ్వాసకోశానికి సంబదించిన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

దోమలకు ఉపయోగించే మస్కిటో కాయిల్ ఆస్తమా వంటి సమస్యలను కలిగిస్తుంది. మనం కాయిల్ పొగను ఎంత ఎక్కువగా పీల్చుకుంటే ఆస్తమా వచ్చే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుంది. మస్కిటో కాయిల్ నుంచి వచ్చే పొగ కళ్ళు, చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. కావున సాధారణంగా ఆయుర్వేద చిట్కాలను పాటించి దోమల నుండి ఉపశమనం పొందడం మంచిది.