ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీలు ఎదుర్కునే సమస్యలలో దురద కూడా ఒకటి. ఈ సమస్యతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అందుకే ఈ దురద సమస్య నుండి బయటపడాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం..
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల ఛాతి మీద పొత్తి కడుపు మీద దురదలు సాధారణంగా వస్తాయి. దీనికి గల కారణం ఏమిటంటే ఎక్స్ట్రా బ్లడ్ పంపింగ్, హార్మోన్లలో మార్పులు రావడం వల్ల జరుగుతుంది. గర్భిణీలు దురద సమస్య నుండి బయట పడడానికి ఓట్ మీల్ తీసుకుని ఒక కప్పు నీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే దురద సమస్య నుండి బయట పడవచ్చు.
అంతేకాకుండా కొబ్బరి నూనె కూడా దురద సమస్యలను పోగొట్టడంలో సహాయపడుతుంది. దురద కలిగిన చోట కొబ్బరి నూనెను ఉపయోగించి మసాజ్ చేస్తే దురద సమస్య పోతుంది. నిమ్మరసాన్ని కూడా దురద సమస్యలు పోగొట్టుకోవడానికి ఉపయోగించవచ్చు. దురద ఉన్నచోట నిమ్మరసాన్ని అప్లై చేస్తే వెంటనే రిలీఫ్ ని పొందొచ్చు.