ఏడుపు వల్ల చాలా లాభాలున్నాయ్? అవేంటో తెలుసా..

Are there so many benefits to crying? Get to know Avento

0
88

ఏడుపు అనేది సహజ ప్రక్రియ. ఒక్క మాటలో చెప్పాలంటే గుండెల్లో బాధ కన్నీరు రూపంలో బయటికి వచ్చేటప్పుడు కనిపించే దృశ్యం. ప్రతి ఒక్కరు తమ జీవన ప్రయాణంలో ఖచ్చితంగా ఏడ్చినవారే. ఈ విషయంలో మగవారికంటే ఆడవారు ఎక్కువగా నిష్ణాతులు. అయితే మనకు బాధ,నొప్పి, సంతోషం ఎక్కువైనప్పుడు కన్నీళ్లు వస్తుంటాయి. అయితే ఏడవడం వల్ల కూడా చాలా లాభాలున్నాయని చెబుతున్నారు. మరి అది ఎంతవరకు నిజం? కన్నీళ్ల రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా మనం ఏడ్చిన తరువాత చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది. ఇది మనందరికి అనుభవ గతమే. ఏడవడం వల్ల ఒత్తిడి స్థాయి కూడా తగ్గుతుంది.

నిజానికి కన్నీళ్లు మూడు రకాలు

మొదటి రకం కన్నీరు

కళ్లలో తేమను కాపాడడానికి ఎల్లప్పుడు వస్తాయి. రెండవది- గాలి, దుమ్ము, పొగ కళ్లలోకి చేరినప్పుడు వచ్చేవి. ఇక మూడవ రకం ఒక వ్యక్తి భావోద్వేగానికి లోనైనప్పుడు వచ్చేవి. ఉదాహరణకు.. విచారంగా ఉండటం, బాధపడటం మొదలైనవి. ఒక అధ్యయనం ప్రకారం.. ఒక వ్యక్తి ఏడ్చినప్పుడు ఎటువంటి కెమికల్‌ రియాక్షన్‌ జరుగుందనే విషయంపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ముందుగా ఏడ్వడం వల్ల ఆ వ్యక్తి బాధను మరచిపోయి మంచి అనుభూతిని పొందడం జరుగుతుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది. మంచి నిద్ర వస్తుంది. కళ్లకు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది. 2011లో చేసిన ఓ పరిశోధన ప్రకారం.. కన్నీళ్లలో ఒక ప్రత్యేకమైన రసాయన లైసోజోమ్ కనుగొనబడింది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణం ఉంటుందట. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో ఇది సహాయపడుతుంది. కాబట్టి కన్నీళ్లు వచ్చినప్పుడు వాటిని స్వేచ్ఛగా కారనివ్వడం మంచిది. ఇలా చేయడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

కలక కన్నీరు

ఏదైనా ధూళి వంటివి (ఉదా. ఉల్లి, మిరియం పొడి, దుమ్ము వంటివి) కంటినుండి కన్నీరు స్రవిస్తుంది. ముక్కులో కలిగే వాసన వల్ల, తీవ్రమైన కాంతి వలన, నోటిలి ఘాటైన రుచి కలిగినపుడు కూడా ఇలావే జరుగుతుంది. ఇలా జరిగే అసంకల్పిత ప్రతీకార చర్య ద్వారా కంటికి కలిగిన ఇర్రిటేషన్ పదార్ధాలను తుడిచి వేయడానికి కన్నీరు స్రావం జరుగుతుంది.

ఏడవడం వలన కన్నీరు

బలమైన భావోద్వేగాలు, నొప్పి, తడబాటు వంటి వాటి కారణంగా కూడా కన్నీరు వెలువడుతుంది. మనుషులలో ఈ ప్రక్రియకు సమాంతరంగా ముఖం ఎర్రబడడం, గొంతులో గద్గదత, శరీరం కంపించడం కూడా జరుగుతాయి. పైన చెప్పిన రెండు విధాల కన్నీటిలో కంటె ఈ మూడవ తరహా కన్నీరులో ప్రోటీన్ సంబంధిత పదార్ధాలు, హార్మోనులు ఎక్కువగా ఉంటాయి. ఆ ఉద్వేగ సమయంలో నరాలలో జరిగే సంకేతాల కారణంగా ఇలా జరుగుతుంది.