మొటిమలున్న స్త్రీలకు ఆ కోరికలు ఎక్కువ ఉంటాయా? నిపుణుల మాటేంటి..

0
114

యుక్తవయసు రాగానే శరీరంలో మార్పులు సహజం. అందులో భాగంగానే ముఖంపై మొటిమలు కూడా వస్తాయి. ఒక్క మొటిమ ఉంటే బాగానే ఉంటుంది. మరి ఎక్కువ అయితే ముఖం అంద విహీనంగా తయారవుతుంది. మొటిమలు ఎక్కువ ఉండడంతో నలుగురిలో కలిసి తిరగలేము. మనసారా నవ్వలేం. ఎప్పుడూ అదే ఆలోచన ఉంటుంది. మరి మొటిమలు ఎలా వస్తాయి? మొటిమలు ఎక్కువగా ఉన్నవారిలో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయా? అనేది ఇప్పుడు చూద్దాం..

నిజానికి మొటిమలకు సెక్స్ కోరికలకు సంబంధం ఉండదని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ హార్మోన్లు శరీరంలో ఉత్పత్తి అవడం వల్ల కొన్ని గ్రంథులు ప్రతిస్పందిస్తాయి. మొటిమల రూపంలో అవి కనిపిస్తాయి. అయితే చాలా మందిలో కొద్దిపాటి సెక్స్ హార్మోన్ల ఉత్పత్తి వల్లనే ముఖంపై ఉన్న గ్లాండ్స్​ ప్రతిస్పందించి ఉబ్బుతాయి. అవి మొటిమలుగా కనిపిస్తాయి. అంతే తప్ప ముఖంపై మొటిమలకు సెక్స్​కు సంబంధం ఉండదు.

చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..

నిమ్మరసం, రోజ్‌వాటర్ సమపాళ్లలో తీసుకోవాలి. దీనిని ముఖంపై మొటిమలు ఉన్న భాగంలో రాయాలి. అరగంట తరువాత కడిగేయాలి. తరచూ దీన్ని చేస్తే మూడు, నాలుగువారాల్లో మొటిమలు తగ్గిపోతాయి.

పల్లీనూనె, నిమ్మరసం సమపాళ్లలో తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మర్దనా చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల మొటిమలు తగ్గిపోవడమే కాదు.. మొటిమలతో వచ్చే ఇతర సమస్యలూ మాయమవుతాయి.