మీకు సోడా తాగే అలవాటు ఉందా? అయితే ఇది తెలుసుకోండి..

0
118

మనలో చాలామంది గ్యాస్‌ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుంటారు. ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి చాలామంది సోడాలను కొనుకొన్ని తాగుతుంటారు. సోడాలు అప్పుడప్పుడు తీసుకుంటే పర్వాలేదు కానీ..ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే అంటున్నారు నిపుణులు. ఎందుకో మీరు కూడా ఓ లుక్కేయండి..

రోజూ సోడా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల బారిన పడి ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా  రోజూ సోడా తాగితే ఎముకలు బలహీనమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే…సోడాలో ఉండే ఫాస్పోరిక్ యాసిడ్ శరీరంలోని కాల్షియంను తొలగిస్తుంది. కావున సోడా వినియోగానికి ఎంతదూరంగా ఉంటే అంత మంచిది.

సోడాలో ఆర్టిఫిషియల్ స్వీటెనర్ ఉండడం వల్ల స్థూలకాయానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. అంతే కాదు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన కూడా పడవచ్చు. కావున చీటికిమాటికి సోడా తాగే అలవాటు ఉంటే కాస్త జాగ్రత్తపడటం ఆరోగ్యానికి మంచిది. ఒకవేళ గ్యాస్‌నొప్పి ఉంటే..యాలుకలు తినడం ఉత్తమం