ప్రతి రోజు ఉదయం లేచి బ్రష్ చేసుకోగానే చాలా మంది చేసే పని కాఫీ తాగడం. ఆ తరువాత టిఫిన్ చేయడం అలవాటుగా మారింది. అయితే అల్పాహారంలో మనం తీసుకునే ఆహారం పాత్ర కీలకం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే పరిగడుపున ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉదయం పూట ఖాళీ కడుపుతో ఈ ఆహార పదార్థాలను తీసుకోకపోవడమే మరీ మంచిదంటున్నారు. ఉదయం లేవగానే కూల్‌డ్రింక్స్ అస్సలు తాగకూడదు. ఉదయం పూట ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు మాత్రమే తీసుకోవడం మంచిది. అల్లంలో వేడి నీటిని కలుపుకొని తాగితే జీర్ణక్రియ ఎంతగానో మెరుగు పరుస్తుంది.
ఖాళీ కడుపుతో చూయింగ్ గమ్ నమలడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే నమిలే ప్రక్రియ వల్ల పొట్టలో ఆమ్లాలు ఎక్కువగా విడుదలవుతాయి. ఆ సమయంలో జీర్ణం చేయడానికి కడుపులో ఎలాంటి ఆహార పదార్థాలు ఉండవు.. కాబట్టి ఇవి పొట్ట లోపలి పొరలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. తద్వారా అల్సర్లు ఏర్పడతాయి.
ఆకలితో ఉన్నప్పుడు/పరగడుపున రక్తంలో చక్కెర స్థాయులు పడిపోతాయి. ఇది కోపాన్ని ప్రేరేపించే అవకాశముందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇదే కోపం ఇద్దరి మధ్యా గొడవకు దారితీయచ్చు. అదే ఏదైనా స్నాక్ తీసుకుంటే కొన్నిసార్లు ఆ కోపం తగ్గిపోవచ్చు కూడా! కాబట్టి ముందుగా ఏదైనా తీసుకున్నాకే ఇతరులతో మాట్లాడడం వల్ల గొడవలకు తావివ్వకుండా జాగ్రత్తపడచ్చు.
అలాగే ప్రధానంగా ఉదయం పూట తీపి పదార్థాలను తీసుకోవద్దు. ఉదయాన్నే అల్పాహారం సమయంలో షుగర్ ఉండే వాటిని తీసుకోవడం మంచిది కాదు. ఖాళీ కడుపుతో పచ్చిమిర్చి, స్పైసీగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది కాదు. దీనివల్ల ఇరిటేషన్, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు వస్తాయి.
అల్పాహారంలో కారంతో కూడిన పదార్థాలు తయారు చేసినవి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదంటున్నారు నిపుణులు. ఇవి తినడం వల్ల కడుపులో చాలా అసౌకర్యంగా ఉండటమే కాకుండా ఆమ్ల గాఢతను ఎక్కువగా కలిగి ఉండటంతో అది కొద్ది గంటల పాటు మనకు ఇబ్బందికి గురి చేస్తుంది. ఉదయం పూట కారం పదార్థాలను తీసుకోకపోవడం మంచిది.