మొబైల్ ఇప్పుడు ప్రతీ ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. ఉదయం లేచిన దగ్గరి నుండి నైట్ పడుకునే వరకు ఫోన్ లోనే గడుపుతున్నాం. ఏది కావాలన్నా అంతా ఫోన్. ఆన్ లైన్ లోనే అంతగా అప్డేట్ అయింది జెనరేషన్. అయితే ఫోన్ తో ఎన్ని లాభాలున్నాయో? నష్టాలూ కూడా ఉన్నాయి. అయితే ఉదయం లేవగానే చేసే పనులే మన మూడ్ ఆధారపడి వుంటుందట. మరి మార్నింగ్ లేవగానే చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఉదయం లేవగానే ఫోన్ చూడొద్దు. అలా చేయడం వల్ల మూడ్ ఆఫ్ గా అవుతుంది.
మార్నింగ్ లేవగానే పక్కన ఉన్న వారికీ గుడ్ మార్నింగ్ చెప్పాలి. లేదంటే ఏదైనా జోక్ చదవాలి. అది కాకుంటే అద్దంలో మన మొఖం మనం చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోజంతా ఉత్సాహంగా ఉంటారు.
నిద్రలేవగానే సాధారణంగా టీ, కాఫీ తాగుతుంటారు. అయితే వాటికీ బదులు నిమ్మకాయ నీళ్లు కానీ, మంచినీళ్లు తాగితే బోలెడు ప్రయోజనం.
ఇక పండ్లు మనల్ని రోజంతా యాక్టివ్ గా ఉంచుతాయి. ఎందుకంటే అందులో ఉన్న న్యూట్రీషన్స్ రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి.
ఇక ముఖ్యంగా ఉదయం ఎంత తొందరగా లేస్తే అంత మంచిది. అలా చేస్తే రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు.