మనలో చాలామంది మొక్కజొన్నలను తినడానికి అధికంగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే మొక్కజొన్నలు ఆరోగ్యానికి చాలా రుచికరమైనవిగా ఉండడమే కాకుండా.. ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కానీ వీటిని సరిగ్గా తినకపోతే మాత్రం చాలా ప్రమాదంగా మారుతుందని నిపుణులు తెలియజేస్తున్నాను. ఎందుకో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా?
మొక్కజొన్నలలో ఎన్నో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఫాస్ఫరస్, నియోసిస్, విటమిన్ b6 వంటివి పుష్కలంగా లభిస్తాయి. కానీ మొక్కజొన్నను పచ్చిగా తిన్నా లేదా సరిగ్గా నమలలేకపోయినా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు మొక్కజొన్నలు తినేటప్పుడు సరిగ్గా నమిలి తినడం చాలా మంచిది.
ఒకవేళ సరిగ్గా నమలకుండా తినడం వల్ల మొక్కజొన్న కడుపులో జీర్ణం కాకా.. అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా చాలామంది మొక్కజొన్నలను ఉడకపెట్టి తింటుంటారు. ఒకవేళ మొక్కజొన్నలు సరిగ్గా ఉండకుండా వాటిని తినడం వల్ల మలబద్ధక సమస్యలు, డయేరియా వంటివి వస్తాయి. అంతేకాకుండా కడుపులో మనకి అల్సర్, గ్యాస్ ట్రబుల్, లూజ్ మోషన్స్ వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.