కరోనాతో హోమ్ క్వారంటైన్ లో ఉన్నారా..? అయితే తప్పక ఈ టిప్స్ ని పాటించండి!

Are you in the home quarantine with Corona ..?

0
86

ఇండియాలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. ఈ మహమ్మారి వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కరోనా వచ్చిన వారు నానా తంటాలు పడుతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిందంటే సరైన ఆహరం తీసుకుంటూ మందులు వాడాల్సి ఉంటుంది. అలాగే కరోనా సోకిన వారు 7 నుంచి 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి. అయితే లక్షణాలు యొక్క తీవ్రతను బట్టి హోమ్ క్వారంటైన్ లో ఉంటే మంచిది.

ఇలా ఐసోలేషన్ లో ఉండడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇంట్లో ఐసోలేషన్ లో ఉండడం వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకనే కచ్చితంగా ఈ చిట్కాలను పాటించాలి. వీటిని కనుక ఫాలో అయితే మానసిక సమస్యలు రావు. ఇబ్బందులు కూడా ఉండవు.

కమ్యూనికేషన్ వల్ల బంధాలు బాగుంటాయి. అలాగే మనకి మానసిక సమస్యలు కూడా ఉండవు. కాబట్టి టెలిఫోన్, సోషల్ మీడియాలో స్నేహితులతో కుటుంబ సభ్యులతో కనెక్ట్ అయ్యి ఉండండి. ఇలా మానసిక సమస్యలు లేకుండా ఉండచ్చు.

మ్యూజిక్ వినడం వల్ల కూడా మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఆనందంగా ఉండడానికి మ్యూజిక్ సహాయపడుతుంది. పైసా ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళు మ్యూజిక్ వింటే మంచిది. దీనితో మానసిక ఇబ్బందులు, ఒత్తిడి ఉండవు.

రెగ్యులర్ గా వ్యాయామం చెయ్యడం వలన శారీరిక సమస్యలు, మానసిక సమస్యలు వుండవు. కనుక ఐసోలేషన్ లో వుండే వాళ్ళు కచ్చితంగా రెగ్యులర్ గా వ్యాయామం చెయ్యాలి. కనుక ఐసోలేషన్ లో వుండే వాళ్ళు తప్పక రెగ్యులర్ గా వ్యాయామం చెయ్యాలి.