తొక్కే కదా అని పడేస్తున్నారా..అయితే ఈ బెనిఫిట్స్ మిస్ అవుతున్నట్టే..!

0
98

అన్ని కాలాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ దొరికే పండ్లలో అరటిపండు కూడా ఒకటి. దీని ధర కూడా అందరు కొనే రీతిలోనే ఉంటుంది. అరటిలో ఎన్నో పోషక విలువలు ఉండడం వల్ల మనకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన అరటిపండు తీసుకోమని వైద్యులు సూచిస్తుంటారు. కేవలం అరటిపండు తోనే  కాదు..దాని తొక్కతో కూడా అద్భుతమైన ప్రయోజనాలు పొందొచ్చంటున్నారు నిపుణులు.

దురదల నుంచి ఉపశమనం కల్పించడంలో అరటిపండు తొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఏదైనా దోమ వంటి పురుగుల కాటుకు గురై.. చర్మంపై దురదలు, మంటలు కనుక వస్తే వాటిని తగ్గించడానికి అరటి పండు తొక్క ఉపయోగపడుతుంది. చర్మంపై ఎక్కడైతే సమస్యగా ఉందో అక్కడ అరటి పండు తొక్కను రాసి 10 నిమిషాలు ఆగాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల దురద, మంట తగ్గిపోతుంది.

మన శరీరం లో ఏదైనా భాగంలో చిన్న పాటి నొప్పిగా ఉంటే అక్కడ అరటి పండు తొక్కను కొద్ది సేపు మసాజ్ చేసినట్టు రాయాలి. ఇలా చేస్తే 15 నిమిషాల్లోనే నొప్పి మాయమవుతుంది. ఇంకా ముఖసౌందర్యాన్ని పెంచడంలో కూడా అరటిపండు తొక్క ఉపయోగపడుతుంది. అరటి పండు తొక్క లోపలి భాగాన్ని ముఖంపై రుద్ది అరగంట సేపు ఆగాక గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు.