ప్రస్తుతం చాలామంది అమ్మాయిలు ముఖంపై మచ్చలు, మొటిమలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాటిని తొలగించుకోవడానికి అనేక రకాల చిట్కాలు పాటిస్తూ తీవ్రంగా శ్రమిస్తుంటారు. కానీ ఆశించిన మేరకు ఫలితాలు రాకపోవడంతో నిరాశకు లోనవుతుంటారు. అందుకే వాటితో పాటు ఈ సహజసిద్ధమైన చిట్కాలు ట్రై చేసి చూడండి..
నిమ్మ ముఖ సౌందర్యాన్ని పెంచడంలో, నల్లటి మచ్చలను తొలగించడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. దీనిలో ఉండే విటమిన్ ‘సి’ మచ్చలను, చర్మంపై పేరుకుపోయిన మురికి, జిడ్డుని కూడా తొలగించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఇందుకోసం నిమ్మరసాన్ని గిన్నెలోకి తీసుకొని, దీనిలో దూది ఉండను ముంచాలి. దాంతో నల్లటి మచ్చలు ఏర్పడిన చోట మృదువుగా రుద్ది 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి.
ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ చిట్కాను రోజూ పాటించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. పెరుగు కూడా ముఖ సౌందర్యాన్ని పెంచడంలో, నల్లటి మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. పెరుగుని మచ్చలు ఉన్న చోట రాసి అరగంట పాటు ఆరనిచ్చి కడిగేస్తే ఫలితం ఉంటుంది.