మనం నిత్యం అనేక రకాల ఆహార పదార్దాలు తీసుకుంటాం అందులో కొన్ని మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తీసుకుంటాం. ఇలా మాత్రం తీసుకోవద్దు అంటున్నారు నిపుణులు. చాలా మంది రాత్రి ఉన్న ఫుడ్ ని ఉదయం వేడి చేసి తీసుకోవడం చేస్తారు. ఇలాంటివి మంచిది కాదు ఇలా ఫుడ్ తీసుకోవడం వల్ల అందులో ఉండే పోషకాలు నశిస్తాయి. ముఖ్యంగా ఇలా వేడి చేసి ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి.
ఈ ఫుడ్ నుంచి బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తే ఫుడ్ పాయిజన్ లాంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుడ్డు ఉదయం వండిన గుడ్డు ఆహారం రాత్రి అలాగే తర్వాత రోజు వేడి చేసి తినడం చేయవద్దు. అలాగే ఉడకబెట్టింది నిల్వ ఉంచడం చేయవద్దు. ఇక మరీ ముఖ్యంగా చికెన్, పప్పు ఇవి ఎప్పుడూ మళ్లీ మళ్లీ వేడి చేసి అసలు తినకూడదు. ఇక ఐరన్ ఎక్కువ ఉండే ఫుడ్ కూడా మళ్లీ మళ్లీ వేడి చేసి తీసుకోవద్దు.
పాలకూర లేదా ఆకుపచ్చని కూరగాయలతో వివిధ రకాల వంటలను తయారు చేస్తాం. ఇలా చేసిన ఏ వంట అయినా మళ్లీ వేడి చేసి మాత్రం తీసుకోవద్దు.ఆకుపచ్చ ఆకుకూరల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇలా మీరు మళ్లీ మళ్లీ వేడి చేసి తీసుకుంటే సమస్యలు వస్తాయి. ఇక మీరు చికెన్ కూడా రెండు రోజులునిల్వ ఉంచుకుంటారు ఇలా కూడా మంచిది కాదు. ఇలాంటి చికెన్ తింటే జీర్ణసమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.