ఖాళీ కడుపుతో వీటిని తీసుకుంటున్నారా?

Are you taking these on an empty stomach?

0
85

మనం తీసుకునే ఆహరం మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కేవలం ఆహారం మాత్రమే కాదు.. మనం తినే సమయాన్ని బట్టి కూడా అనారోగ్య సమస్యలను నియంత్రించడం లేదా మరింత పెంచడం వంటివి జరుగుతుంటాయి. కొన్ని ఆహార పదార్థాలను సరైన సమయానికి తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే మరికొన్ని పదార్థాలను ఖాళీ కడుపుతో తీసుకున్న.. ఉదయాన్నే తిన్నా.. లేదా సరైన సమయంలో కాకుండా వేరే టైంలో తీసుకున్న తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే ఖాళీ కడుపున ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

బొప్పాయి:

ఖాళీ కడుపుతో బొప్పాయి తీసుకోవడం వల్ల కూడా కడుపు బాగుంటుంది. అలానే చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. చెడు కొలెస్ట్రాల్ ని దూరం చేస్తుంది. గుండె సమస్యలు కూడా వుండవు. డయాబెటిస్ తో బాధపడే వాళ్లు ఖాళీ కడుపుతో దీనిని తీసుకుంటే కూడా మంచిదే.

తేనే-వేడి నీళ్లు:

వేడి నీళ్లలో కొద్దిగా తేనె వేసుకుని ఖాళీకడుపుతో తీసుకోవడం వల్ల అదిరే ప్రయోజనాలు మీరు పొందొచ్చు. తేనెలో మినరల్స్, విటమిన్స్, ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. తేనే లో వేడి నీళ్ళు కలిపి తీసుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇంటస్టైన్స్ కూడా శుభ్రంగా ఉంటాయి.

డ్రై ఫ్రూట్స్:

ఖాళీకడుపుతో జీడిపప్పు, బాదం, పిస్తా, ఎండుద్రాక్ష వంటివి తీసుకుంటే కూడా మేలు కలుగుతుంది. ఇలా వీటిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. అలానే ఇతర ప్రయోజనాలు కూడా పొందొచ్చు. కాబట్టి వీటిని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి.