ఈ పండ్లు అధికంగా తీసుకుంటున్నారా! తస్మాత్ జాగ్రత్త..

0
93

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.సాధారణంగా పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ మరియు ఇతర పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని చాలా మంది రెగ్యులర్ గా నచ్చిన పండ్లను తీసుకుంటూ ఉంటారు. పండ్లలో పంచదార ఎక్కువగా ఉంటుంది అందుకని పండ్లు అధికంగా  తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.

అయితే కొన్ని పండ్లలో మాత్రం షుగర్ కంటెంట్ ఎక్కువగా  ఉంటుంది. ఇటువంటి పండ్లకు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి వాటిని తెలుసుకుని ఈ పండ్లకి దూరంగా ఉండాలి. లేదంటే తగ్గించడం మంచిది.

.

సపోటా:

సపోటాలో కూడా షుగర్ అధికంగా  ఉంటుంది. 60 గ్రాముల సపోటా పండ్లలో 15 గ్రాముల షుగర్ ఉంటుంది. కాబట్టి సపోటాను కూడా ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది.

లిచీ:

లిచీలో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో మెగ్నీషియం, క్యాల్షియం, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల లక్షీ పండ్లలో 15.2 గ్రాముల షుగర్ ఉంటుంది. కాబట్టి దీనిని కూడా లిమిట్ గా తీసుకోవాలి.

మామిడి పండ్లు:

మామిడి పండ్లు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. వేసవికాలంలో మనకు ఎక్కువ మామిడిపండ్లు దొరుకుతాయి. వందగ్రాముల మామిడి పండ్లలో 14 గ్రాములు షుగర్ ఉంటుంది. కనుక వీటిని కూడా తక్కువగా గా తీసుకుంటే మంచిది.

ద్రాక్ష పళ్ళు:

ద్రాక్ష ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే ఇందులో షుగర్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల ద్రాక్షపండ్లలో 16 గ్రాముల షుగర్ ఉంటుంది. కాబట్టి ద్రాక్ష పండ్లను ఎంత తగ్గిస్తే అంత మంచిది.

అరటి పండ్లు:

అరటి పండ్ల వల్ల చాలా ప్రయోజనం పొందవచ్చు. ఇందులో పొటాషియం, విటమిన్ సి, మెగ్నీషియం, ఫైబర్ కూడా ఉంటాయి. 100 గ్రాముల అరటి పండ్లలో12 గ్రాముల షుగర్ ఉంటుంది కాబట్టి ఈ పండ్లను కూడా లిమిట్ గా తీసుకుంటే మంచిది.

సలహా: షుగర్ పేషెంట్స్ ఈ పండ్లను ఎంత తక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది.