ఈ వస్తువులను వాడుతున్నారా..గడువు దాటితే గండమే!

Are you using these items?

0
96

మనం రోజువారీ ఉపయోగించే కొన్ని వస్తువులకు ఎక్స్​పైరీ తేదీ ఉంటుంది. ఆ విషయం తెలియక చాలా మంది వాటిని ఏళ్ల తరబడి వాడేస్తుంటాం. ఇంతకీ ఆ వస్తువులేంటి. వాటి సంగతేంటి ఓ సారి చూద్దాం. ఆహారపదార్థాలకు, మందులకు, సౌందర్య ఉత్పత్తులకు గడువు తేదీ ఉన్నట్లే..వాడే వస్తువులకూ ఉంటుందని గుర్తించండి. వాటిని ఏళ్ల తరబడి వాడేస్తుంటే కొత్త అనారోగ్యాలు తప్పకపోవచ్చు అంటున్నారు వైద్యులు.

టూత్‌ బ్రష్‌లు: వీటి విషయంలో చాలా మంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. నాలుగైదు నెలలకోసారైనా బ్రష్‌ తప్పక మార్చాలి. ముఖ్యంగా అది రంగుమారినా, కుచ్చులు ఊడినా, వంకరపోయినా..పక్కన పారేయాలి. లేదంటే అవి పళ్లకు హానికరంగా మారతాయి. చిగుళ్లను గాయపరుస్తాయి.

దువ్వెనలు: వీటినిపదిరోజులకోసారి శుభ్రం చేయాలి. అందుకు వేడినీళ్లల్లో బేకింగ్‌ సోడా వేసి కడగాలి. వీటిని ఏడాదికి మించి వాడకపోవడమే మేలు.

లో దుస్తులు: ఇవి ఎక్కువగా ఒంటికి అతుక్కుని ఉంటాయి. వీటికి చెమట ఎక్కువ పడుతుంది. ఒక్కోసారి రంగును కూడా కోల్పోతాయి. ఆకృతీ పోతుంది. ఇలాంటివి వాడితే వెన్ను నొప్పి, ఇతరత్రా సమస్యలు ఎదురుకావొచ్చు. లేదా బ్యాక్టీరియా చేరి అలర్జీలు రావొచ్చు. ఏడాదికి మించి వీటిని వాడకపోవమే మేలు.

తలగడ: దిండును ఏళ్ల తరబడి వాడితే మెడ, వీపు నొప్పి ఖాయం అంటున్నారు వైద్యులు. దీనిలో ఉండే దూది, ఫోమ్‌ వంటివి ఎగుడు దిగుడుగా మారి సమస్యకు కారణం అవుతాయి. అంతేకాదు..సూక్ష్మజీవులు చేరి శ్వాస సంబంధిత సమస్యలతో పాటు..అలర్జీలూ వస్తాయి. అందుకే రెండేళ్లకోసారైనా వీటిని మార్చాల్సిందే.