ఈ కరోనా సమయంలో ఆటో ప్రయాణం సేఫ్ – అధ్యయనం చెప్పేది ఇదే

Auto Travel Safe During Corona

0
70

 

కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ఈ సమయంలో ప్రయాణాలు చేయాల్సిన వారు కూడా వాయిదా వేసుకుంటున్నారు. ఇక తప్పదు అనుకుంటే ప్రయాణాలకు సొంతంగా కారు, ఆటో, క్యాబ్ బుక్ చేసుకుంటున్నారు. బస్సులు రైళ్లల్లో ప్రయాణాలు చేయడం లేదు.

కరోనా వేళ ఏ వాహనంలో జర్నీ చేస్తే వైరస్ ముప్పు అధికంగా ఉంటుందో యూఎస్ జాన్ హాప్ కిన్స్ వర్సిటీకి చెందిన బ్లూమ్ బర్గ్ పరిశోధకులు వెల్లడించారు. మరి ఆ విషయాలు ఏమిటో చూద్దాం.

కోవిడ్ సోకిన వ్యక్తి ఆటోలో వెళ్లేసమయంలో వైరస్ వ్యాప్తి కంటే , ఏసీ కారులో వెళితే 250 నుంచి 300 రెట్లు అధికంగా ఉంటుంది. ఆటోతో పోల్చితే నాన్ ఏసీ కారులో 86 రెట్లు, కిటికీలన్నీ తెరిచి 40మంది ప్రయాణించే బస్సులో 72శాతం ఎక్కువగా ఉంటుందట. మీరు కారు, బస్సు, ఆటో ఈ మూడింటిలో చూస్తే ఆటో బెటర్ అంటున్నారు నిపుణులు. అయితే కచ్చితంగా మాస్క్ ధరించి శానిటైజర్ వాడాల్సిందే. ఈ సమయంలో ఆటోలో బయట నుంచి వచ్చే వెంటిలేషన్ ఎక్కువ. గాలి బాగా వస్తూ ఉంటుంది. దీని వల్ల వైరస్ ముప్పు తక్కువగా ఉంటుందట.