Fruits: పండ్లు తిని నీళ్లు తాగుతున్నారా..? చాలా డేంజర్‌ అయితే..!

-

Fruits: ఆరోగ్యానికి పండ్లు మంచివని తిన్నాక.. మంచి నీళ్లు తాగుతున్నారా.. అయితే వెంటనే ఆ అలవాటు మానుకోండి. ఎందుకంటే పండ్లు (Fruits) తిన్న తరువాత నీళ్లు తాగటం వల్ల సహజంగా ఉండే జీర్ణరసాలు పలుచబడిపోయి, జీర్ణ సమస్యలు ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అసలు ఏ పండ్లు తిన్న తరువాత అస్సలు మంచి నీళ్లు తాగకూడదో తెలుసుకుందాం రండి…

- Advertisement -

పుచ్చకాయ నీటి శాతం అధికంగా ఉండేవాటిలో ప్రథమ స్థానంలో ఉంటుంది. పుచ్చకాయ తిన్న తరువాత నీళ్లు తాగటం కారణంగా, మన ఉదరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే జీర్ణ రసాలు పలుచబడిపోతాయి. దీనివల్ల కడుపు ఉబ్బరంగా మారటం లేదా, కడుపు నొప్పి, అజీర్తి వంటి వాటితో బాధపడాల్సి వస్తుంది.
సిట్రస్‌ జాతి పళ్లు (Fruits)తిన్న తరువాత కచ్చితంగా మంచినీళ్లకు అరగంట అయినా దూరంగా ఉండాల్సిందేనని డాక్టర్లు సూచిస్తున్నారు. నారింజ, ఉసిరి, సిజనల్‌ వంటి సిట్రస్‌ పండ్లను తిన్న తరువాత మన జీర్ణవ్యవస్థ నుంచి యాసిడ్‌ రిలీజ్‌ అవుతుంది. ఈ జాతి పండ్లను తిన్న వెంటనే నీళ్లు తాగటంతో.. జీర్ణాశయంలో పీహెచ్‌ బ్యాలెన్స్‌ తప్పుతుంది. దీంతో జీర్ణ సంబంధిత బాధలు వెంటాడుతాయి. అలాగే పాలు తాగిన తరువాత కొందరికి నీళ్లు తాగటం అలవాటు, కానీ ఇలా చేయటం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది ఎసిడిటీ, అజీర్ణానికి కారణం అవుతంది. కాబట్టి పళ్లు (Friuts) తిన్న తరువాత నీళ్లు తాగకుండా ఉండటమే ఉత్తమం.

Read also: వార్నర్‌కు స్వీట్‌ న్యూస్‌ చెప్పిన క్రికెట్‌ ఆస్ట్రేలియా

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dharmendra | సీనియర్ హీరోకు కోర్టు నోటీసులు.. ఏ కేసులోనంటే..!

బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర(Dharmendra)కు ఢిల్లీలోని పటియాలా కోర్టు నోటీసులు జారీ...

Kartik Aaryan | ‘మద్దతు లేదు.. నాది ఒంటరి పోరాటమే’

ఇండస్ట్రీలో తాను చాలా సవాళ్లు ఎదుర్కొంటున్నానని చెప్పాడు బాలీవుడ్ యంగ్ హీరో...