కొంత మందికి సీజన్ మారే కొద్ది జలుబు గొంతు నొప్పి అనే సమస్యలు వేధిస్తాయి. ఇక కొత్త ప్రాంతాలకు వెళితే అక్కడ నీరు తాగితే అది పడక కొందరు గొంతు నొప్పితో ఇబ్బంది పడతారు. అయితే నీరు తాగే సమయంలో నొప్పి వస్తుంది అని ఫీల్ అవుతారు. ఇక ఆహారం తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు.
ఇలా గొంతు నొప్పి ఉన్నవారు వేడిగా ఉన్న పదార్ధాలు తింటే మంచిది
ఇక చపాతి తిన్నా ఆహారం తిన్నా కూరలు తిన్నా రైస్ తిన్నా వేడిగా తీసుకోండి దీని వల్ల మీకు గొంతు నొ్పి నుంచి ఉపశమనం ఉంటుంది. ఇమ్యునిటీ పెరిగే పండ్లు ఆహారం. సిట్రిస్ పండ్లు గొంతులో ఇరిటేషన్ కలిగిస్తాయి అవి తినకపోవడం మేలు
టమాటా కూడా ఇంచుమించు అదే సమస్యను కలిగిస్తుంది. చింతపండు కూడా తగ్గించండి . ఇక పానీపూరీలు చాట్ మసాలాలు బటర్ తో చేసే ఫుడ్ నూనె లో వేపిన వస్తువులు ఇలాంటివి తినకపోవడం మేలు. ఇక డెయిరీ ప్రొడక్ట్స్ కి కూడా దూరంగా ఉంటే గొంతు నొప్పి కాస్త తగ్గుతుంది . పచ్చళ్లు తినేవారు కూడా ఈ సమయంలో తీసుకోకపోవడం మంచిది ఇకపెరుగు కూడా గొంతు నొప్పి ఉంటే మానేయ్యండి అది తగ్గాక మాత్రమే పెరుగు మజ్జిగ తీసుకోండి .డ్రింక్స్ కెఫీన్ ఉండే కాఫీ టీలు, బ్రెడ్ చిప్స్ సమోసాలు, ఐస్ క్రీమ్స్ కి దూరంగా ఉంటే గొంతు నొప్పి గరగర తగ్గుతాయి.