చేదుగా ఉన్న ఆహరపదార్దాలు పోపుల సామాన్లు అంటే చాలా మంది ఇష్టం చూపరు …కాని అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, కాకరకాయ మెంతులు వాము ఇలాంటివి ఘాటుగా ఉన్నా ఎంతో మేలు చేస్తాయి. ఇక బాలింతలకు ఎలాంటి ఆహరం పెడతారో తెలిసిందే.
వారికంటూ ప్రత్యేకంగా ఆహరం వండుతారు, అయితే వారికి మెంతులు తింటే ఎంతో ప్రయోజనం అంటున్నారు, పెద్దవాళ్లు డాక్టర్లు నిపుణులు ఇదే చెబుతున్నారు, బాలింతలకు మెంతులు ఇవ్వడం వల్ల తల్లిపాలు వృద్ధి చెందుతాయని నిర్ధారించారు.
మెంతులలో ఉండే ఫైటో ఈస్ట్రోజన్లు పాల ఉత్పత్తిని పెంచుతాయని చెబుతున్నారు, అందుకే బాలింతలకు మెంతులు ఇవ్వచ్చు అని చెబుతున్నారు..పాలిచ్చే తల్లులు రోజుకు ఆరు గ్రాముల వరకు మెంతులు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుందట. ఇక వారికి వాంతులు విరోచనాలు వస్తే మాత్రం మెంతులు తీసుకోవద్దు అంటున్నారు..ఇక రోజూ లీటరు వరకూ పాలు ఏదో ఒక రూపంలో వినియోగించాలి. బ్రెడ్ తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.