బచ్చలి కూర తింటున్నారా దీని వల్ల ప్రయోజనాలు తప్పక తెలుసుకోండి

బచ్చలి కూర తింటున్నారా దీని వల్ల ప్రయోజనాలు తప్పక తెలుసుకోండి

0
80

వర్షాకాలంలో అనేక మొక్కలు బాగా పెరుగుతాయి, పాదులు కూడా ఈ సమయంలో చాలా బాగా వస్తాయి, నాలుగు చినుకులు వస్తే వెంటనే ఏపుగా పెరిగే పాదులు ఉన్నాయి, ఇక అందులో ముఖ్యంగా ఆకుకూరగా బచ్చలి చెప్పుకోవాలి, కార్తిక మాసంలో బచ్చలి కూర బాగా తింటారు.

బచ్చలిని మనం ఆహారంగా తీసుకోవడం వల్ల వానాకాలంలో వచ్చే అనేక అనారోగ్యసమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇది మంచి ఔషదంగా కూడా చెబుతారు..బచ్చలిలో రెండు రకాలు ఉన్నాయి. తీగబచ్చలి, కాడబచ్చలి. గ్రామాల్లో ఏ ఇంటి ముందు చూసినా ఏ చిన్నా ఆధారం దొరిగినా ఎగబాకే బచ్చలి తీగ కనిపిస్తుంది.

కాని నగరాల్లో మనం 20 లేదా 50 పెట్టి కొనుక్కోవాలి, పెరట్లో కూడా ఇది బాగా పెరుగుతుంది.బచ్చలి కూర పప్పు, టమాట బచ్చలి, బచ్చలికూర పచ్చడి రసం ఇలా అనేక రకాల వంటలు వండుతారు, ఇది బాడీకి చాలా మంచిది, రెయినీ సీజన్లో పల్లెల్లో వారానికి రెండు రోజులు తింటారు.

బచ్చలికూరలో కాల్సియం, పొటాషియం, మెగ్నిషియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. కంటి సమస్యలు ఉన్న వారు ఇది తింటే తగ్గుతాయి.
బచ్చలి మల మద్దకాన్ని నివారిస్తుంది. అలాగే శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. .శరీరంలో కొవ్వు తగ్గడానికి బచ్చలికూర మంచి ఆహారం. ఇక నోటి పుండ్లు ఉన్నా బచ్చలి ఆకు నమిలితే తగ్గుతాయి.