రాగి పాత్రల్లో తినేవారికి బ్యాడ్ న్యూస్ తప్పక తెలుసుకోండి

రాగి పాత్రల్లో తినేవారికి బ్యాడ్ న్యూస్ తప్పక తెలుసుకోండి

0
230

చాలా మంది రాగి పాత్రలు వాడటానికి ఇంట్రస్ట్ చూపిస్తారు .. అంతేకాదు పూర్వం నుంచి ఇవేకదా వాడాము అని చెబుతారు. అయితే వాస్తవానికి రాగి పాత్రల్లో ఫుడ్ తింటే ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయో అంతే మైనస్ కూడా ఉందట ఆరోగ్యానికి… తాజాగా ఇదే విషయాన్ని డాక్టర్లు చెబుతున్నారు.. అన్నింటికి రాగి గ్లాసులు కంచాలు ఫ్యాషన్ అయింది అని ఇది అంత మంచిది కాదు అని చెబుతున్నారు.

ఇప్పుడు వచ్చేది అంతా మంచి రాగి కాదు అని కోటింగ్ ఐటెమ్ అని చెబుతున్నారు… ఒరిజినల్ అయితేనే బెటర్ అని చెబుతున్నారు, ఇక రాగి పాత్రల్లో ముఖ్యంగా వెన్న, పాలు ,ఐస్ క్రీమ్ ,కొబ్బరి నీరు ,వేడి వేడి కాఫీలు, ఇలాంటివి తాగకూడదు.. దీనివల్ల మీ శరీరంలోకి చెడు బ్యాక్టిరియా వెళుతుంది.అది ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలున్నట్టు నిపుణులు చెబుతున్నారు.

అలాగే మనం ఎంతో ఇష్టపడి తినే ఊరగాయలు, పచ్చళ్లను రాగి గిన్నెల్లో స్టోర్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే వాటిలో ఉండే పుల్లదనానికి రాగిలో ప్రతిచర్యలు జరిగి వాంతులు వస్తాయి అందుకే రాగి పాత్రలలో వీలైనంతగా ఈ పదార్ధాలు తింటే వీటికి దూరంగా ఉంచండి