బాదం తినడం వల్ల కలిగే పది ప్రయోజనాలు ఇవే

బాదం తినడం వల్ల కలిగే పది ప్రయోజనాలు ఇవే

0
119

బాదం గింజలు చాలా మంది తింటారు, ఇది కాస్ట్ అయినా సరే ఇవి తినడం మంచిది అంటున్నారు వైద్యులు, ఎందుకు అంటే బాదం పప్పు వల్ల శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి, అంతేకాదు వీటి వల్ల పిల్లలకు పెద్దలకు శక్తి వస్తుంది, అలసట దూరం అవుతుంది. అలాగే రోగ నిరోధక శక్తిని వృద్ధి చేసే ఆహారాన్ని డైట్లో జోడించడం మంచిది .

విటమిన్ ఈ, జింక్, రాగి, ఫోలేట్, ఇనుము లాంటి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి,. బాదంలో విటమిన్-ఈ అధికంగా ఉంటుంది. అలాగే ఎలాంటి శ్వాసకోశ ఇబ్బందులు రావు, అంతేకాదు ఇందులోయాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

వైరస్, బ్యాక్టీరియా వల్ల ఎదురయ్యే అంటువ్యాధుల నుంచి తగిన రక్షణను విటమిన్ ఈ అందిస్తుంది.
ఇందులో రాగి ఉండటం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుంది, రోగాల బారిన పడకుండా చేస్తుంది, ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది, ఎముకలు బలంగా మారతాయి.గుప్పెడు బాదం తీసుకుంటే ఎంతో మంచిది, అలాగే బాదం పప్పులు తినే సమయంలో అవి నానబెట్టి తిన్నా మంచిదే.