మనం రోజూ స్నానం చేస్తాం.. కాని తలస్నానం రోజు చేసేవారు చాలా అరుదు అనే చెప్పాలి.. వందలో 10 మంది ఉంటారు, అయితే ఎన్నిరోజులకి తల స్నానం చేస్తే మంచిది అనేది చాలా మందికి ప్రశ్న.మన శరీరంపై ఉన్న దుమ్ముదూళి స్నానం చేస్తే పోతుంది, మరి తలపై కూడా దుమ్ముదూళి చెమట ఉంటుంది అది తలస్నానం చేస్తేనే పోతుంది.
మీకు కుదిరితే రోజు తలస్నానం చేయవచ్చు, లేదంటే రెండు రోజులకి ఓసారి కచ్చితంగా తల స్నానం చేయండి.. మీరు ఇంట్లో ఉన్నా కూడా బ్యాక్టీరియా ఎటాక్ ఉంటుంది, అందుకే తలపై చుండ్రు చెమట పోవాలి అంటే ఇలా రోజు తలస్నానం మంచిది, షాంపులు కాకుండా కుంకుడు కాయలు లేదా సాధారణంగా తలపై నీరు పోసుకోండి.
రోజూ తల స్నానం వలన మంచి బ్యాక్టీరియా బ్యాలెన్స్ ని మెయింటెయిన్ చేయడానికి వీలుంటుంది. చలికాలంలో గోరు వెచ్చని నీరు వాడడం మంచిది. మరీ వేడి నీటి స్నానం వల్ల స్కిన్ డ్రై గా అయిపోతుంది. అయినా తలపై చెమట చుండ్రు తగ్గకపోతే నేరుగా వైద్యుడ్ని సంప్రదించండి అలసత్వం వద్దు.