సాధారణంగా మనం ఉదయం లేదా సాయంత్రం స్నానం చేస్తుంటాం. కొంతమంది ఉదయం స్నానం చేస్తే గాని భోజనం చేయరు. మరికొంతమంది తిన్న వెంటనే స్నానం చేస్తుంటారు. అయితే ఈ అలవాటు మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి భోజనం తర్వాత స్నానం చేయడం వల్ల కలిగే అనర్ధాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన అనే అనారోగ్య సమస్యలు వస్తాయి. స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి ఆహరం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాగే రక్త ప్రసరణ సరిగా జరగదు. దీనితో ఆహరం జీర్ణం కాకపోగా అజీర్తి లాంటి సమస్యలు వస్తాయి.
ఇంకా దీని వల్ల చర్మ సమస్యలు వంటివి వస్తాయి మరి మీకు ఆ అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. ఒకవేళ మీకు ఆ అలవాటు ఉంటే భోజనం చేసిన గంట తర్వాత స్నానం చేయడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.