జొన్నరొట్టెలు తింటే కలిగే లాభాలు ఇవే తప్పక తెలుసుకోండి

Be aware of the benefits of eating Sorghum Roti

0
105

ఈ మధ్య రాత్రి పూట చాలా మంది రైస్ తినకుండా జొన్నరొట్టెలు తింటున్నారు. వైద్యులు కూడా జొన్న రొట్టెలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు. కొన్నేళ్ల క్రితం జొన్న రొట్టెలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తినేవారు. ఈ మధ్య కాలంలో జొన్నరొట్టెల వాడకం బాగా పెరిగింది. ఈరొట్టెలు రెండు తిన్నా కడుపు నిండిన భావం కలుగుతుంది. అంతేకాదు ఎముక పుష్టి కూడా ఉంటుంది. జొన్న రొట్టెలు, జొన్న పిండితో చేసిన ఇతర వంటకాలు సులభంగా అరుగుతాయి. అందుకే మలబద్దకం ఉండదు అజీర్తి సమస్యలు రావు.

గోధుమపిండి వంటకాలు తీసుకుంటే చాలా మందికి ఇందులో గ్లూటెన్ ఉంటుంది అని భయం. కాని జొన్న రొట్టెల్లో గ్లూటెన్ ఉండదు. ఇక ఫైబర్ ఉండటం వల్ల ఈజీగా అరుగుతుంది. బీపీ సమస్య రాకుండా నివారిస్తుంది. ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, జింక్, విటమిన్ బీ3 ఉండడం వల్ల ఎముకలు బలపడతాయి. ఊబకాయం సమస్య ఉన్నా, బరువు తగ్గాలి అని భావిస్తున్నా ఈ జొన్నరొట్టె తింటే మేలు.

మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మనం ఈజొన్న రొట్టె తింటే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అందుకే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. రాత్రి పూట డయాబెటిస్ ఉన్న వారు చాలా మంది జొన్నరొట్టెలని ప్రిఫర్ చేస్తున్నారు.