మీరు ఆకుకూరలతో పోల్చితే, దుంపకూరలలో తక్కువ ఖనిజాలు ఉంటాయి.. అందుకే దుంప కూరలు పెద్దగా తీసుకోవడానికి ఇష్టపడరు, అయితే ఇందులో కార్బొహైడ్రెడ్ర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఊబకాయం పెరుగుతుంది ఫ్యాట్ వస్తుంది.. అందుకే దీనిని తక్కువ మంది తీసుకుంటారు.. ఏది అయినా మితంగా తీసుకుంటే మంచిదే అయితే దుంపల్లో కూడా కొన్ని మంచి పోషకాలు మన శరీరానికి అందుతాయి . అందులో చిలకడదుంపలు ఒకటి.
చిలకడ దుంపలో చర్మకణాలను బిగుతుగా మార్చే కొల్లాజిన్ ఉత్పత్తిని పెంచే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చర్మం కాంతి వంతంగా ఉంటుంది ఇవి తీసుకుంటే మీరు పది రోజులకి ఓసారి తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే..
వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది. ఇక మీరు శీతాకాలం వర్షాకాలం తీసుకుంటే సీజనల్ వ్యాధులు దరిచేరవు.
గుండె సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. కండరాలు బలంగా మారతాయి, అలాగే ఆరోగ్యానికి ఇలా చాలా మేలు చేస్తుంది
క్యాన్సర్ రాకుండా మీకు సాయపడుతుంది శరీరానికి, ఇక వీటిని కాల్చి తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ ఒకటి గమనించండి ఇవి ఉడకబెట్టి తింటే ఇందులో పోషకాలు నీటిలోకి వెళ్లిపోతాయి..కట్టెల మీద కాల్చడం లేదా ఓవెన్ లో కాల్చడం లాంటివి చేస్తూ తినడం వల్ల పోషకాలు అందుతాయి.