ఇప్పుడు అంతా బిజీలైఫ్ సరైన ఆహారం కూడా ఎవరూ తీసుకోవడం లేదు. అంతా బయట ఫుడ్ కి అలవాటు పడుతున్నారు. అయితే మనం తీసుకునే ఆహారం సరైన నిద్ర ఇవన్నీ కూడా మన ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తాయి. అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన ఇలాంటి కారణాల వల్ల రోగాల బారిన పడుతున్నారు జనం. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. మన దేశంలో కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే కిడ్ని సమస్యలు అంత తేలిగ్గా బయటపడవు. అందుకే కొన్ని లక్షణాలు కనిపిస్తే వెంటనే ఈ సమస్యని గుర్తించండి అంటున్నారు వైద్యులు.
ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త?
1. తరచూ మీ మూత్రం పసుపు పచ్చగా రావడం ఓ లక్షణం
2. మూత్రం లేత పసుపు కలర్ లో పదే పదే వస్తూ ఉంటే అశ్రద్ద వద్దు
3. తరచూ కాళ్లవాపు వస్తున్నా? కాళ్లకు నీరు పట్టినట్లు అనిపించినా
4. కిడ్నీలు చెడిపోతే ఆకలి వేయదు వేసినా మీకు రుచి తెలియదు
5. రోజూ వికారం రావడం, వాంతులు చేసుకోవడం ఇలాంటి సమస్యలు వస్తే ఆగకుండా ఈ సమస్య కనిపిస్తే టెస్ట్ చేసుకోవాల్సిందే
6.కిడ్నీలు ఉండే భాగంలో నొప్పి వస్తుంటుంది
7. వేడిగా ఉన్నప్పుడు కూడా చల్లగా ఉన్న ఫీలింగ్ మీకు కలుగుతుంది
ఇలాంటి సమస్యలు లక్షణాలు కనిపిస్తే వెంటనే మీరు వైద్యులని సంప్రదించాలి.