మిల్లెట్స్ తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అనేది తెలిసిందే… సజ్జలు రాగులు, జొన్నలు ఇలా వీటికి ఇప్పుడు ఎంతో డిమాండ్ ఉంది, రైస్ మానేసి చాలా మంది ఆహరంగా వీటినే తీసుకుంటున్నారు.. పచ్చి కాయగూరలు ఉడకబెట్టి ఈ మిల్లెట్స్ తో ఆహరం వండుకుంటున్నారు,
ఇక సజ్జలు చాలా మంది తింటారు అనేది తెలిసిందే, వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి, మంచి హెల్దీ ఫుడ్ గా చెబుతున్నారు డైట్ నిపుణులు.బాదం పప్పు, నువ్వులు, అల్లం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సజ్జల్లోని మెగ్నీషియం, రిబోఫ్లావిన్ ఎక్కువగా ఉండటం వల్ల తలనొప్పిని తగ్గించడానికి సహాయ పడుతుంది.
ఎవరైనా తలనొప్పితో బాధపడితే సజ్జలతో ఆహరం తింటే సమస్య తగ్గుంది.. డాక్టర్లు చెప్పేదాని ప్రకారం మెగ్నీషియం మైగ్రేయిన్ తలనొప్పిని నయం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.
అలాగే బాదంలో వుండే పోషకాల వల్ల రక్తనాళాలు, కండరాలకు విశ్రాంతి ఇవ్వటం ద్వారా ఒత్తిడి తగ్గించి తలనొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే ఈ సమస్య ఉన్న వారు వారానికి రెండు మూడు రోజులు సజ్జల అన్నం, సజ్జల రొట్టెలాంటివి చేసుకోని తినాలి అని చెబుతున్నారు.