మొటిమ‌లు రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ తప్పకుండా పాటించండి..

0
107

అందంగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. ముఖ్యంగా అమ్మాయిలు అందంపై ఎక్కువగా ఆసక్తి చూపుతారు. కానీ ప్రస్తుతం చాలామంది అమ్మాయిలు మొటిమల సమస్యతో బాధపడుతున్నారు.  అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ పాటిస్తే మొటిమ‌ల స‌మ‌స్య త‌గ్గ‌డ‌మే కాదు. జీవితాంతంవాటికి దూరంగా ఉండవచ్చు. మ‌రి ఈ టిప్స్ ఏంటో ఓ లుక్కేసేయండి.

ప్రతిరోజు ఆలివ్ ఆయిల్‌ను ముఖాన్ని అప్లై చేసి కాసేపు మ‌సాజ్ చేసుకోవాలి. దీనివల్ల మొటిమలు తొలగిపోతాయి. మురికి, మ‌ల‌నాలు పేరుకుపోవడం వల్ల మొటిమలు వస్తాయి. కాబట్టి రోజు నాలుగు లేదా ఐదు సార్లు అన్నా వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి. దాంతో జిడ్డు పోయి మొటిమలు రాకుండా ఉంటాయి.

మొటిమ‌లు రాకుండా ఉండాల‌టే జంక్ ఫుడ్‌, ఆయిలీ ఫుడ్‌, షుగ‌ర్స్, ఆల్క‌హాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. మొటిమ‌ల‌కు దూరంగా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు మేక‌ప్‌ను పూర్తిగా తొలగించాలి. అలాగే ప్ర‌తి రోజు వాట‌ర్ ఎక్కువ‌గా తీసుకోవాలి. క‌నీసం ఎనిమిది గంట‌ల పాటు నిద్ర పోవాలి. ప్రతిరోజు వ్యాయామాలు, యోగా వంటివి చేయాలి.