మనకు ఏదైనా అనారోగ్యంగా అనిపిస్తే వెంటనే వైద్యుడి దగ్గరకు వెళతాం. అయితే కొన్నిసార్లు మందుల దుకాణాలకు వెళ్లి మందులు తెచ్చుకుని తగ్గిపోయింది కదా అని అనుకుంటా. కానీ తరచూ ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటే ఆలస్యం చేయవద్దు అంటున్నారు నిపుణులు. కిడ్నీ మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. మనం ఏదైనా మందులు వాడితే వాటి ప్రభావం కూడా కిడ్నీలపై ఉంటుంది.
అయితే కిడ్నీ సమస్యలు అంత తొందరగా బయటపడవు చాలా సమయం తీసుకుంటుంది. ప్రతి సంవత్సరం మన కిడ్నీ ఒక శాతం సామర్థ్యాన్ని కోల్పోతూనే ఉంటుంది అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం వద్దు. ఎవరికి అయినా ఆకలి లేకపోవడం, వాంతులు, బలహీనత, పాదాలు, నోటిలో వాపు, రక్తపోటు పెరగడం, మూత్రంలో నురుగు రావడం ఇలాంటి సమస్యలు వస్తే వెంటనే మరో ఆలోచన లేకుండా వైద్యుల దగ్గరకు వెళ్లండి.
సడెన్ గా కూర్చున్నా నీరసం రావడం, చిన్న పని చేసినా అలసట అనిపించడం, ఆకలి లేకుండా రోజంతా ఉండటం ఇవన్నీ కూడా లక్షణాలుగా చెబుతున్నారు. షుగర్ బీపీ ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. పెయిన్ కిల్లర్లు, ఆయుర్వేదిక్ భస్మ, హెవీ డోస్ మెడిసన్ ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి అంటున్నారు.