Thirsty | అతిదాహం.. ఈ రోగాలకు సంకేతమా..!

-

ప్రస్తుత ఉరుకులు పరుగుల ప్రపంచంలో వ్యాధులను నిర్లక్ష్యం చేయడం కూడా ఒక అలవాటులా మారిపోతోంది. కానీ పెద్దపెద్ద ఆరోగ్య సమస్యలను సైతం చిన్న చిన్న లక్షణాలతో గుర్తించొచ్చని వైద్యులు అంటున్నారు. వాటిలో దాహం కూడా ఒకటని చెప్తున్నారు. ఎన్ని నీళ్లు తాగినా దాహం(Thirsty) తీరకపోవడం, గొంతు తడి ఆరిపోవడం, నోరు పిడసకట్టడం, పదేపదే దాహం వేయడం, డీహైడ్రేటెడ్‌గా అనిపించడం వంటి ఎన్నో ప్రమాదకర వ్యాధులకు లక్షణాలే కావొచ్చని వివరిస్తున్నారు నిపుణులు. చాలా మంది దాహం అతిగా కావడాన్ని ఏదో సాధారణ సమస్యగా భావిస్తారని, కానీ ఇది కొన్ని తీవ్రమైన వ్యాధులకు సంకేతంగా నిలుస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. దాహం వేయడం సహజమే అయినా పదేపదే దాహం వేయడం మాత్రం ఎన్నింటికో సంకేతాలని అంటున్నారు నిపుణులు. ఈ సమస్య ఒక్క రోజు కన్నా ఎక్కువ కొనసాగితే మాత్రం వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

- Advertisement -

దాహంగా అనిపించడం అంటే శరీరంలో ద్రవం లేకపోవడం అని శరీరం చెప్తోంది. సాధారణ పరిస్థితుల్లో నీరు తాగిన తర్వాత దాహం తగ్గుతోంది. కానీ నీరు తాగిన తర్వాత కూడా దాహంగా అనిపిస్తే అది తీవ్ర సమస్యలకు సంకేతం. దీని గురించి తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి. సాధారణంగా రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాలి. నీరు ఎక్కువగా తాగడం కూడా తీవ్ర ప్రమాదానికి దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాహమే కదా అవుతుంది.. నీళ్లు తాగితే సరిపోతుంది. డాక్టర్ దగ్గరకు ఎందుకు అని అనుకుంటే ప్రమాదం తప్పదని, దాని నుంచి తప్పించుకోవాలంటే అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు వైద్యులు. మరి ఇంతకీ అధిక దాహం ఎటువంటి రోగాలకు సంకేతమవుతుందో చూద్దామా..

హైపోకలేమియా: రక్తంలో పొటాషియం శాతం సాధారణం కంటే తక్కువగా ఉన్నప్పుడు హైపోకలేమియా పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యతో బాధపడుతున్న రోగులకు నీరు ఎంత తాగుతున్నా దాహం వేస్తూనే ఉంటుంది. వాంతులు, విరేచనాలు, కొన్ని మందులు తీసుకోవడం పొటాషియం స్థాయిని ప్రభావితం చేస్తుంది. ఈ సమస్య చాలా కాలం పాటు కొనసాగితే దాహం ఎక్కువగా అనిపించవచ్చు.

డయాబెటిస్ ఇన్సిపిడస్: డయాబెటిస్ ఇన్సిపిడస్ సమస్యలో కూడా పదే పదే దాహం వేస్తూనే ఉంటుంది. నీరు తాగినప్పటికీ దాహం వేధిస్తూనే ఉంటుంది. ఈ వ్యాధిలో మూత్రపిండాలు, దాని సంబంధిత గ్రంథులతో పాటు హార్మోన్లు కూడా ప్రభావితమవుతాయి. దీని కారణంగా అదనపు మూత్రం బయటకు రావచ్చు. దీని వల్ల మళ్ళీ మళ్ళీ దాహం వేస్తుంది.

పాలీడిప్సియా: మన శరీరానికి నీరు చాలా ముఖ్యం. అందులో ఎటువంటి సందేహం లేదు. దాహం(Thirsty) అనిపించడం అనేది ఒక సాధారణ ప్రక్రియ. కానీ మీకు మళ్ళీ మళ్ళీ దాహం వేస్తే అది పాలీడిప్సియా లక్షణం కావొచ్చు. ఇది చాలా రోజులు, వారాలు లేదా నెలల పాటు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో నీళ్లు తాగుతున్నా దాహం తీరదు.

Read Also: ఆటో వాలా ఆలోచన అదుర్స్.. ఇంప్రెస్ అవుతున్న నెటిజన్స్..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Coconut Milk Benefits | చలికాలంలో కొబ్బరి పాలతో పసందైన ఆరోగ్యం..

Coconut Milk Benefits | చలికాలం వస్తోందంటే రోగాలు ఎటాక్ చేయడానికి...

Sonu Sood | ఆ రోల్ కోసం చాలా కష్టపడ్డా: సోనూ సూడ్

సోనూ సూద్(Sonu Sood) అనగానే కరోనా తర్వాత రియల్ లైఫ్ హీరో...