యాలుకలు(Elaichi).. ప్రపంచవ్యాప్తంగా వంటశాస్త్రంలో వీటికంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు ప్రతి దేశం కూడా వాటి వంటకాల్లో దాదాపు అన్నింటిలో యాలుకలను వినియోగిస్తాయి. వీటిని వినియోగించడం వల్ల మన వంటకు ప్రత్యేకమైన ఫ్లేవర్, సువాసన రావడమే కాకుండా ఎన్నో ఆరోగ్య లాభాలను కూడా అందిస్తుంది. ప్రతి రోజూ యాలుకలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, మన ఆరోగ్యానికి అండగా ఉండే సత్తా ఈ చిట్టి-పొట్టి యాలుకలకు ఉందని నిపుణులు అంటున్నారు. అయితే వీటిని అతిగా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయంటున్నారు. ఇంతకీ యాలకలతో ఉండే ప్లస్‌లు మైనల్‌లు ఏంటో చూద్దాం..
యాలుకలు మన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అజీర్ణం, ఉబ్బరం నుంచి ఉపశమనం అందిస్తుంది. దాంతో పాటుగా మన రోగనిరోధక శక్తిని పెంచి.. ఆర్థరైటిస్, కీళ్లనొప్పులను తగ్గించడంలో ఉపయోగపడతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరాన్ని ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. కణాలకు ఎటువంటి నష్టం కలుగకుండా వాటిని కాపాడుతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు(Antioxidants) మన మొత్తం ఆరోగ్యాన్ని ఒక కంట కనిపెట్టి ఉంచుతాయి. వీటిలో మన గుండె పదిలంగా ఉండటానికి కూడా యాలుకలు ఎంతగానో ఉపయోగపడతాయని, రక్తం గడ్డకట్టడాన్ని నివారించడం, రక్త ప్రసరణ సజావుగా సాగేలా చేస్తాయి. బరువు తగ్గడంలో కూడా ఇవి మనకు ఎంతగానో ఉపయోగపతాయి. కొవ్వును కరిగించడంలో యాలుకలకు ప్రత్యేక స్థానం ఉంది. ఆకలిని అణచివేయడం, ఏదో ఒకటి తినాలని అనిపించే జివ్వ కోరికలను తగ్గించడంలో ఇవి బాగా పనిచేస్తాయి.
ప్రతిరోజూ 4 నుంచి 10 యాలుకల వరకు తినొచ్చని, వీటి సంఖ్య కాస్తంత అటూ ఇటూ అయినా పర్లేదు కానీ.. ఏదో ఉద్యమంలా వీటిని తింటే మాత్రం తిప్పలు తప్పవని వైద్య నిపుణులు చెప్తున్నారు. రోజూ వీటిని అధిక సంఖ్యలో తినడం వల్ల మన జీర్ణ వ్యవస్థపై నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. డయేరియా, పొత్తికడుపు నొప్పి, తలతిరగడం, వాంతులు కావడం వంటివి రావొచ్చు. హైబీపీకి కూడా కారణం కావొచ్చు. హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్ కావడం వల్లే అనేక సమస్యలు వస్తాయి. వీటితో పాటుగా యాలుకలను అతిగా తినడం వల్ల శరీరం చెక్కబారు తనంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ ఇలాంటి లక్షణాలను మీరు గనుక గమనిస్తే డాక్టర్ల దగ్గరకు పరిగెత్తాల్సిన అవసరం లేదని, మీరు తినే యాలుకల సంఖ్యను తగ్గిస్తే సరిపోతుందని నిపుణులు చెప్తున్నారు. యాలుకలు(Elaichi) తినడం తగ్గించినా ఈ సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించడం ఉత్తమం అని సూచిస్తున్నారు.