ఎండాకాలంలో సాయంత్రం స్నానం వల్ల ప్రయోజనాలివే..!

0
85

ప్రస్తుతం వేసవి కాలం ప్రారంభమైంది. ఇప్పుడే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. రోజంతా సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండగా.. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. వేసవి వస్తూ వస్తూనే తనతోపాటు వడగాలులు, దాహం, నీరసం, అలసట… తీసుకొస్తుంది. వీదీంతో ప్రజలు ఎండనుంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే డీహైడ్రేషన్ కాకుండా ఎప్పటికప్పుడు హెల్తీ ఫుడ్స్, డ్రింక్స్ తీసుకుంటూ శరీరంలో నీటి శాతం పెంచుకుంటున్నారు. అయితే వేసవిలో అనేకసార్లు స్నానం చేసే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా ఉదయం ఉద్యోగాలకు వెళ్లేవారు.. సాయంత్రం మళ్లీ స్నానం చేసి రిలాక్స్ అవుతుంటారు.  స్నానం చేయడానికి కొన్ని నియమాలు కూడా పాటించాలి.

ఉదయం కంటే సాయంత్రం స్నానం చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. స్నానం చేసే సమయంలో రక్తప్రసరణ మెరుగుపడడమే కాకుండా.. మానసిక ఒత్తిడి తగ్గుతుందని మీకు తెలుసా.. మానసిక ఒత్తిడి,కుంగుబాటు ఉన్నప్పుడు స్నానం చేయడం వలన మీలో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది.అందుకే స్నానం ఎప్పుడెప్పుడు చేయాలనే విషయాలను ఖచ్చితంగా తెలుసుకోండి. అలాగే స్నానం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

సాయంత్రం స్నానం చేయడానికి వల్ల కలిగే లాభాలు

వేసవిలో చాలా మంది ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్లీ సాయంత్రం కూడా స్నానం చేసేందుకు ఇష్టపడతారు. అయితే ఉదయం పూట తల స్నానం చేయడం కంటే.. సాయంత్రం తలస్నానం చేయడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. పగటిపూట పనిచేసే సమయంలో దుమ్ము.. మట్టి.. శరీరం.. జుట్టుపై పెరుగుకుపోతుంది.

ముఖ్యంగా వేసవి,వర్షకాలంలో పడుకునే ముందు తలస్నానం చేయడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వలన శరీరం మాత్రమే కాదు. మనసు కూడా రిలాక్స్ అవుతుంది. దీంతో మంచి నిద్ర వస్తుంది. అందుకే ఉదయం మాత్రమే కాకుండా.. సాయంత్రం కూడా స్నానం చేయడం అలవాటు చేసుకోవాలని అంటున్నారు నిపుణులు.