ఆర్థరైటిస్‌కు అదిరిపోయే చిట్కా..

-

ఈ మధ్యకాలంలో చాలా మందిని ఇబ్బండి పెడుతున్న సమస్య ఆర్థరైటిస్( Arthritis Pain). కీళ్లనొప్పులు, కీళ్ల బలహీనత, కీళ్ల చుట్టూ ఉండే కండరాల నొప్పి, వాపు ఉండటం దీని లక్షణాలు. కాస్తంత ఊబకాయం ఉందంటే వారిలో దీని ప్రభావం మరింత అధికంగా ఉంటుంది. వారి అధికబరువు.. ఆర్థరైటిస్‌కు మరింత బలమైన ఇంధనంలా పనిచేసి నొప్పులను విపరీతం చేస్తుంది. ఆర్థరైటిస్ వచ్చిన వారికి ఎక్కువ శాతం చేతులు, మోకాళ్లు, తుంటి, వెన్నెముక వంటి ప్రదేశాల్లో నొప్పులు వస్తుంటాయి. ఈ ఆర్థరైటిస్‌కు ఆదిలోనే మందు వేస్తే చాలా మంచిదని వైద్యులు కూడా అంటున్నారు. ఆర్థరైటిస్‌కు ఆయుర్వేదంలో అద్భుతమైన చిట్కా ఒకటి ఉందని, అది పాటిస్తే ఆర్థరైటిస్ ఉన్నా లేనట్లే ఉంటుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఈ చిట్కా అనేది ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడమే కాకుండా సమస్యను కూడా నయం చేయగలదని చెప్తున్నారు. వీటి కోసం ఎంతో కష్టపడాల్సిన, శ్రమ చేయాల్సిన పని కూడా లేదంటున్నారు.

- Advertisement -

అనేక వ్యాధులకు, రోగాలకు ఆయుర్వేదంలో చిన్నచిన్న చిట్కాలు(Ayurvedic Remedy), వంటగదిలోని పదార్థాలతోనే చికిత్స చెప్తుంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం ప్రత్యేక మొక్కలు, ప్రత్యేక పద్దతి ద్వారా ఔషదాన్ని తయారు చేసుకోవాలని సూచిస్తుంటుంది. అటువంటి చిట్కానే ఒకటి ఆర్థరైటిస్‌కు కూడా ఉంది ఆయుర్వేదంలో. ఆ చిట్కాలో చింత గింజలను ప్రధానంగా వినియోగిస్తారు. చింత గింజలు మన కీళ్ల మధ్య ఉండే లూబ్రికేషన్‌ను గుజ్జు పదార్థాన్ని పెంచడంలో సహాయపడతాయి. దాంతో పాటుగానే చింతగింజల్లో ఉండే టానిన్లు, ఫ్లేవనాయిడ్స్ వంటి మరికొన్ని సమ్మెళనాలు పలు ఇతర సమస్యలను తగ్గించడంలో కూడా కీలకంగా వ్యవహరిస్తాయి. ఇవే లక్షణాలు ఆర్థరైటిస్ సమస్యను కూడా సమసిపోయేలా చేస్తాయి.

ప్రతి రోజూ నిర్ణీత మోతాదులో చింతగింజల పొడిని తీసుకుంటే చాలు. రెండు మూడు రోజుల్లోనే ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. దీంతో పాటుగా ఆర్థరైటిస్ నొప్పి( Arthritis Pain) ఉన్న ప్రాంతంలో కాపడం పెట్టడం, ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం కూడా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. యోగా, స్విమ్మింగ్ వంటి కీళ్లను దృఢంగా చేసే వ్యాయామాలు చేయడం కూడా మంచిదేనని నిపుణులు చెప్తున్నారు.

Read Also: భోజనం తర్వాత స్నానం చేస్తే ఇన్ని సమస్యలా..!
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

White Hair | తెల్ల జుట్టుకు తేలికైన చిట్కాలు..

తెల్ల జుట్టు(White Hair) అనేది ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతున్న...

Baby John | అదరగొడుతున్న ‘బేబీ జాన్’ ట్రైలర్..

మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh).. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘బేబీ...