Best Foods | సంతానోత్పత్తి లోపం ప్రస్తుత యువతలో అధికంగా కనిపిస్తున్న సమస్య. పెళ్ళయిన తర్వాత పిల్లల కోసం ఎంత ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో ఆసుపత్రుల బాట పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు అధికం అవుతోంది. ఇందుకు కొన్ని జంటల్లో మహిళల్లో సమస్య ఉంటే.. మరికొన్ని జంటల్లో పురుషుల్లో లోపం ఉంటుందని, అందుకనే మహిళలు, పురుషులు ఇద్దరూ కూడా ముందు నుంచే తమ పునరుత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగానే మహిళల్లో అండాశయం ఆరోగ్యంగా ఉండాలి, అప్పుడు ప్రతి నెలా సక్రమంగా అండాలు విడుదలై గర్భం దాల్చడం సులువుగా అవుతుందని వైద్యులు చెప్తున్నారు. కాగా ఈ అండాశయం ఆరోగ్యం కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని, మన ఆహారంలో కొన్నింటిని చేర్చుకుంటే సరిపోతుందని అంటున్నారు. మరి అవేంటో చూద్దామా..
Best Foods for Healthy Ovaries:
అవిసె గింజలు: వీటి వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కానీ వాటిని తినే వారు మాత్రం చాలా తక్కువగానే ఉన్నారు. అవిసె గింజల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు, లిగ్నాన్స్ శరీరంలోని ఈస్ట్రోజన్ స్థాయిలను సమతుల్యంగా ఉంచుతాయి. సమతుల్య హార్మోన్లు ఆరోగ్యకరమైన అండాలను అందిస్తాయి.
అవకాడో: ఇందులో ఉండే మోనో శాచ్యురేటెడ్ కొవ్వులు హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రిస్తాయి. అంతేకాకుండా అవకాడోల్లో ఉండే ఫోలేట్.. అండాల అభివృద్ధికి సహాయపడుతుంది. అండోత్సర్గము సరిగా జరిగేలా కూడా చూసుకుంటుంది. గర్భం దాల్చాలని కోరుకునే మహిళలు అవకాడో తినడం చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. దీనిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటికి కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఆకు కూరలు: పాలకూర, కాలే వంటి ఆకుకూరలను వారంలో మూడు రోజులు మన ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అన్నీ మన పునరుత్పత్తి వ్యవస్థను బలోపేతం చేయడం కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో కూడా ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. వీటిని వారంలో రెండు మూడు సార్లు తినడం వల్ల ఆరోగ్యకరమైన అండాలు ఉత్పత్తి అవుతాయి.
బెర్రీ పండ్లు: బెర్రీల్లో ఏ రకమైనా సరే అవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ శరీరకణాలపై ఆక్సీకరణ ఒత్తిడి పడకుండా చేస్తాయి. కణాల ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. ఈ బెర్రీలో శరీరంలోని ఎండోక్రైయిన్ పనీతీరును మెరుగుపరుస్తుంది. ఇవి ఇన్సూరెన్స్ స్థాయిలను కూడా స్థిరంగా ఉంచుతాయి. పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న మహిళలకు బెర్రీలు ఎంతో మేలు చేస్తాయి.