Belly Fat | బెల్లీ ఫ్యాట్ భలే డ్రింక్స్.. వీటిని ట్రై చేయండి..

-

బెల్లీ ఫ్యాట్‌(Belly Fat)ను తగ్గించుకోవడం కోసం ఈ తరం యువత పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆహారం మానుకుని, కొవ్వు కరిగేలా కసరత్తులు చేస్తున్నారు. కానీ బెల్లీ ఫ్యాట్ తగ్గడం కోసమే అయితే అంత కష్టపడాల్సిన అవసరం లేదని, కండలు తిరగాలంటే తప్పదని అంటున్నారు నిపుణులు. బెల్లీ ఫ్యాట్‌ను ఇంట్లో తయారు చేసుకునే హెల్తీ డ్రింగ్స్ తాగడం ద్వారా తగ్గించుకోవచ్చని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఈ డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలోని చెడు కొవ్వు వేగంగా కరుగుతుందని, బరువును కూడా సులభంగా తగ్గించుకోవచ్చని అంటున్నారు నిపుణులు. అయితే అసలు ఈ తరం యువతలో బెల్లీ ఫ్యాట్ సమస్య తీవ్రంగా ఉండటంపై కూడా వైద్యులు తీవ్రంగా స్పందిస్తున్నారు.

- Advertisement -

బిజీ లైఫ్ వల్లనో, వర్క్ ప్రెజర్ వల్లనో వాళ్లలో మానసిక రుగ్మతలు అధికం అవుతున్నాయని, దానికి తోడు రోజుకు 10 నుంచి 15 గంటల పాటు ఒకే చోట కూర్చుని కదలకుండా పనులు చేస్తుండటం వల్ల కూడా పొట్ట భాగంలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోతుందని నిపుణులు చెప్తున్నారు. అదే విధంగా బిజీ లైఫ్ స్టైల్‌లో భాగంగా సరిగా ఆహారం తీసుకునే సమయం కూడా దొరక్కనో లేక నోటికి రుచిగా అనిపించో అధికంగా జంక్ ఫుడ్ లాగించేయడం కూడా బెల్లీ ఫ్యాట్ పెరగడానికి ఒక కారణం అని, ఖర్చు చేసే క్యాలరీలకన్నా అధిక మోతాదులో క్యాలరీలను తరచుగా తీసుకోవడం వల్ల కొవ్వు పెరుగుదలకు కారణం అవుతున్నాయని నిపుణులు చెప్తున్న మాట. అయితే ఈ సమస్యకు కొన్ని హోమ్ మేడ్ డ్రింక్స్‌తో చెక్ చెప్పొచ్చని అంటున్నారు. మరి ఆ డ్రింక్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందామా..

పుదినా వాటర్: బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో పుదినా నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయని నిపుణులు చెప్తున్నారు. పుదినా జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు కడుపులోని ఎసిడిటీని తగ్గించడంలో సహాయపడుతుంది. అదే విధంగా కొవ్వును కరిగించడంలో కూడా పుదినా ఆకులు దివ్యఔషధంలా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు. అందుకోసం నాలుగైదు పుదినా ఆకులను నీటిలో వేసి ఆ నీరు సగం అయ్యే వరకు మరిగించి, ఆ తర్వాత ఆ నీటిని వడపోసి తాగాలి. ఇలా తరచుగా చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్ త్వరగా కరుగుతుందని అంటున్నారు.

గ్రీన్ టీ: ప్రతి రోజూ ఉదయాన్ని గ్రీన్ టీ తాగడం వల్ల కూడా బెల్లీ ఫ్యాట్‌(Belly Fat)ను తగ్గించొచ్చని నిపుణులు వివరిస్తున్నారు. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా బరువు తగ్గడంలో కూడా గ్రీన్ టీ మంచి ఫలితాలను అదిస్తుంది. రోజుకు రెండు నుంచి మూడు కప్పుల గ్రీన్ టీ తాగితే బరువు వేగంగా తగ్గొచ్చని నిపుణులు చెప్తున్నారు. బరువు వేగంగా తగ్గాలనుకునే వారికి గ్రీన్‌టీ సూపర్ మెడిసిన్‌లా పనిచేస్తుందని చెప్తున్నారు.

ఫ్రూట్ జ్యూస్: బరువు తగ్గాలంటే డైటింగ్ చేయాలి. కానీ ఆకలితో అలమటించాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. ఆకలిని అదుపు చేయడం కోసం పండ్ల రసాలను తీసుకోవాలని, వీటిలో ఉండే ప్రొటీన్లు, ఫైబర్ కంటెంట్ ఆకలిని అదుపు చేస్తాయని, క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల ఫ్యాట్ త్వరగా తగ్గుతుందని చెప్తున్నారు నిపుణులు. నారింజ, ద్రాక్ష, ఆపిల్ వంటి పండ్లలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండి శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తూనే బరువు తగ్గించడంలో సహాయపడతాయి. వీటితో పాటు కావాలంటే వెజిటేబుల్ జ్యూస్‌లు తాగడం వల్ల కూడా బరువును, కొవ్వును తగ్గించుకోవచ్చని అంటున్నారు నిపుణులు.

పెరుగు: మీరు విన్నది కరెక్టే.. బరువు తగ్గించడంలో పెరుగు కూడా సూపర్ ఫుడ్‌లా పనిచేస్తుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు బరువును తగ్గించడంలో సహాయ పడుతుంది. పెరుగును పండ్లు, గింజలతో కలిపి కూడా తీసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే పెరుగుకు బదులుగా మజ్జిగ తాగడం వల్ల మరిన్ని బెనిఫిట్స్ పొందొచ్చని నిపుణులు చెప్తున్నారు.

Read Also: తెల్లని చర్మం కోసం తేలికైనా చిట్కాలు..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Coconut Milk Benefits | చలికాలంలో కొబ్బరి పాలతో పసందైన ఆరోగ్యం..

Coconut Milk Benefits | చలికాలం వస్తోందంటే రోగాలు ఎటాక్ చేయడానికి...

Sonu Sood | ఆ రోల్ కోసం చాలా కష్టపడ్డా: సోనూ సూడ్

సోనూ సూద్(Sonu Sood) అనగానే కరోనా తర్వాత రియల్ లైఫ్ హీరో...