Skin Health | చలికాలంలో చర్మం మెరిసిపోవాలా.. ఇవి వాడండి..

-

చలికాలం వచ్చిందంటే ముందుగా దెబ్బతినేది మన చర్మమే. కాస్తంత చలి పెరిగినా చర్మం పొడిబారిపోవడం, పగుళ్లు రావడం జరుగుతుంటాయి. అందుకే చలికాలం వచ్చిందంటే చర్మ ఆరోగ్యం(Skin Health)పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. చలికాలంలో గాలిలోని తేమ వల్ల చర్మం రంగు కూడా మారుతుంటుంది. ఈ సమస్యలతో ఇబ్బంది పడే వారి.. చర్మ ఆరోగ్యం కోసం అనేక రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌ను వినియోగిస్తుంటారు.

- Advertisement -

ఒక్కసారి అవి వికటించి ర్యాషేస్ రావడం, దద్దుర్లు రావడం, ఎర్రటి మచ్చలు ఏర్పడటం వంటివి జరుగుతుంటాయి. దీంతో స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడాలన్న కొందరు ఇబ్బంది పడుతుంటారు. అలా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే హోమ్ రెమెడీస్‌ పాటించడం మంచిదని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు.

ఈ హోం రెమెడీస్ వాడటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. వింటర్‌లో కూడా మెరిసిపోతుంది. ఈ రెమెడీస్ తయారు చేసుకోవడం చాలా సులభం. అంతేకాకుండా ఇవి ఇచ్చే ఫలితాలను చూస్తే.. మరోసారి బ్యూటీ ప్రొడక్ట్స్ జోలికి కూడా వెళ్లరని నిపుణులు అంటున్నారు. మరి అవేంటో ఒకసారి తెలుసుకుందామా..

శనగపిండి, మీగడ: ఒక బౌల్‌లో నాలుగు చెంచాల శనగపిండి, నాలుగు చెంచాల మీగడ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని మొఖం, చేతులు, కాళ్లు, పాదాలకు బాగా పట్టించాలి. అది ఆరిపోయే వరకు ఉంచి ఆ తర్వాత స్నానం చేసేయాలి. ఇలా చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. మీగడ, శనగమిండి రెండూ కూడా మృత కణాలను తొలగించడంలో కీలకంగా పనిచేస్తాయి. మృతకణాలు పోవడం ద్వారా చర్మానికి మరింత తేమ లభిస్తుంది. దాని వల్ల శీతాకాలంలో కూడా చర్మం ఆరోగ్యంగా(Skin Health) ఉంటుంది.

శనగపిండి, వేజలిన్: ఒక చెంచా వేజలిన్ తీసుకుని అందులో ఒక చెంచా శనగపిండి వేసుకుని బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని శరీరానికి బాగా పట్టించి 15-30 నిమిషాల తర్వాత బాగా రుద్ది కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా శనగపిండి.. మన మృతకణాలను తొలగిస్తుంది. వేజలిన్.. తేమను పెంచుతుంది. తద్వారా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే వేజలిన్ స్థానంలో మరేదైన మాయిస్చరైజింగ్ క్రీమ్‌ను కూడా కలుపుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు.

మీగడ, తేనె: ఈ రెండు సమపాలలో తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని కాళ్లు, చేతులు, మొఖానికి బాగా పట్టించాలి. ఒక అరగంట తర్వాత బాగా రుద్ది కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం తన సహజమైన మెరుపును పొందడంతో పాటు ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా తరచుగా చేయడం ద్వారా చలికాలంలో వచ్చే చర్మ సమస్యల నుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మొఖానికి మీగడ రాయడం వల్లే కలిగే ప్రయోజనాలు: మీగడ.. చర్మానికి తేమను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చలికాలంలో చర్మ ఆరోగ్యానికి మీగడ అనేది సూపర్ మెడిసిన్‌లా పనిచేస్తుంది. చర్మ సహజ మెరుపును చెక్కుచెదరకుండా చేస్తుంది. మన చర్మం సాగే గుణాన్ని కూడా మీగడ పునరుద్దరిస్తుంది.

కాబట్టి చలికాలంలో మీగడను వాడటం అనేక ప్రయోజనాలు ఉంటాయి. వీటితో పాటుగా మీగడ రాయడం ద్వారా అనేక అలెర్జీల నుంచి మన చర్మాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా దురద, దద్దుర్లు వంటి వాటి నుంచి ఉపశమనం అందిస్తుంది.

Read Also: ఏయే విటమిన్ వల్ల ఏంటి లాభం.. వాటిని పొందాలంటే ఏం తినాలి..?
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...