Snoring Problem | గురక సమస్య సతాయిస్తోందా…. ఇలా ట్రై చేయండి..

-

Snoring Problem | గురక.. ఇది మన కన్నా మన పక్కన ఉండే వారికి పెద్ద సమస్యలా ఉంటుంది. వారు నిద్ర లేక చాలా సతమవుతుంటారు. పక్క వారి తలనొప్పిలా మారినందుకు ప్రతిరోజూ మనం కూడా చాలా షేమ్‌గా ఫీలవుతుంటాం. ఈ సమస్య నుంచి బయటపడాలని ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండకుండా పోతుంది. అయితే గురక సమస్యకు అనేక కారణాలు ఉంటాయని వైద్యులు చెప్తున్నారు.

- Advertisement -

అదే విధంగా గురక సమస్య నుంచి బయటపడటానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుందని, ఈ సమస్య సమసిపోతుందని వైద్యులు వివరిస్తున్నారు. ప్రారంభ దశలో గురక సమస్యకు ఊబకాయం, ముక్కు, గొంతు కండరాలు బలహీనపడటం, జలుబు, ధూమపానం, శ్వాస సమస్యలు, ఊపిరితిత్తులలో సరైన స్థాయిల్లో ఆక్సిజన్ లేకపోవడం, సైనస్ సమస్యలు వంటికి కారణమవుతుంటాయి.

ఈ గురక సమస్య(Snoring Problem) బాధితుల నిద్రకు ఎటువంటి అంతరాయం కలిగించకపోయినప్పటికీ పక్క వారికి మాత్రం నిద్ర లేకుండా చేస్తుంటుంది. దీని వల్ల మనకేమో కానీ పక్కన ఉండేవారికి నిద్రలేమి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు అంటున్నారు.

అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా గురక సమస్య నుంచి బయటపడొచ్చని వైద్యులు అంటున్నారు. కాగా.. గురక సమస్యకు ఎంత త్వరగా వైద్యం ప్రారంభించుకుంటే అంత త్వరగా సమసిపోతుందని, బాగా ముదిరిపోయిన తర్వాత చిట్కాలను వాడటం, వైద్యులను సంప్రదించడం చేసినా.. అంతే ఆలస్యంగా సమస్య తగ్గుతుందని అంటున్నారు నిపుణులు. మరి ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం..

దాల్చిన చెక్క: గోరువెచ్చని నీరు ఒక గ్లాసుడు తీసుకోవాలి. అందులో దాల్చిన చెక్క పొడిని ఒకటి రెండు చెంచాలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ నీటిని చిన్నగా తాగాలి. ఇలా తరచూ చేస్తూ ఉండటం ద్వారా గురక సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చని నిపుణులు అంటున్నారు.

వెల్లుల్లి: చిన్నుల్లిపాయలతో కూడా గురక సమస్య నుంచి బటయపడొచ్చని వైద్యులు అంటున్నారు. ప్రతి రోజూ పడుకునే ముందు ఒక వెల్లుల్లి రెబ్బను గోరువెచ్చని నీటితో తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా గురక సమస్య సమసిపోతుందని వైద్యులు వివరిస్తున్నారు.

పుదీనా: నాలుగైదు పుదినా ఆకులు తీసుకోవాలి. వాటిని ఒక గ్లాసుడు నీళ్లలో వేసి ఆ నీటిని బాగా మరిగించాలి. సగం మేరా నీరు ఆవిరైన తర్వాత.. ఆ నీటిని గ్లాసులో పోసుకుని గోరువెచ్చగా ఉన్న సమయంలో తాగేయాలి. ఇది ప్రతి రోజూ చేయడం ద్వారా గురక సమస్య తగ్గుతుంది.

ఆలివ్ ఆయిల్: శ్వాస సంబంధిత కారణాల వల్ల గురక వచ్చే వారికి ఆలివ్ ఆయిల్ దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్‌తో ముక్కును మర్దన చేయడం ద్వారా.. శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అందులో భాగంగానే గురక సమస్య కూడా సమసతిపోతుందని వైద్యులు అంటున్నారు.

అదే విధంగా ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక్కో ముక్కులో రెండు నుంచి నాలుగు చుక్కల ఆలివ్ ఆయిల్‌ను వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా గురక సమస్య క్రమంగా మాయమవుతుంది.

నెయ్యి: గురక సమస్యకు దేశీ నెయ్యి వాడటం కూడా అద్భుత ఫలితాలను కనబరుస్తుంది. ఇందుకోసం దేశీ నెయ్యిని కొద్దిగా వేడి చేసుకోవాలి. అది చల్లారిన తర్వాత ఆ నెచ్చిని ముక్కులో వేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా గురక సమస్య దూరమవుతుందని నిపుణులు వివరిస్తున్నారు.

పసుపు: పసుపు అనేక వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది. మన రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇది కీలకంగా పనిచేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్న పసుపుతో గురక సమస్యను కూడా దూరం చేయొచ్చని వైద్యులు అంటున్నారు. ప్రతి రోజూ పడుకునే ముందు వేడి పాలలో ఒక చెంచా పసుపును కలుపుకుని తాగాలి. పాలు లేకపోతే.. గోరువెచ్చని నీటిలో అయినా పసుపు వేసుకుని తాగడం ద్వారా గురక సమస్యను తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఈ చిట్కాలు పాటించినా గురక సమస్య తగ్గకపోతే.. వైద్యులను సంప్రదించడం మంచాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే విధంగా గురకే కదా అని తేలికగా తీసుకోవద్దని, ఈ సమస్య పెరిగితే అనేక ఇతర సమస్యలకు కూడా దారి తీస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.

Read Also: చలికాలంలో ముల్లంగి తింటే ఇన్ని ప్రయోజనాలా..!
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Delhi Elections | BJP మేనిఫెస్టోలో సంచలన హామీ?

Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 5న ఓటింగ్...

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట: ఆ అధికారులపై సీఎం సీరియస్ యాక్షన్

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని,...