ప్రస్తుతం కాలుష్య యుగంలో యువత కూడా ఆయాసం(Asthma)తో ఇబ్బంది పడుతున్నారు. జంక్ ఫుడ్, ఒబేసిటీ, అధిక బరువు, ఇన్ఫెక్షన్ ఇలా కారణం ఏదైనా నాలుగడుగులు వేసేసరికి ఆయాసం ముంచుకొచ్చేసి ఊపిరాడకుండా చేస్తుంటుంది. నోట మాట కూడా రానివ్వదు. నాలుగు మెట్లు ఎక్కినా సరే.. కనీసం 20 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. కొందరిలో ఈ ఇబ్బంది మరింత అధికంగా ఉంటుంది. మరికొందరికి లోపల ఇన్ఫెక్షన్ ఉండటం వల్లో మరేదైనా కారణం వల్లో ఈ ఆయాసం ప్రస్తుతం అధిక సంఖ్యలో ప్రజలను ఇబ్బంది పెడుతున్న సమస్య. ఈ ఆయాసం నుంచి ఉపశమనం కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గం ఎంచుకుంటారు. అయితే ఈ ఆయాసం నుంచి ఉపశమనం పొందడానికి మన ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించొచ్చని, వాటి వల్ల ఆయాసం తగ్గి ఉపశమనం లభిస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. మరి ఆ చిట్కాలేంటో చూసేద్దామా..
ఆయాసం(Asthma)తో బాధపడుతున్న వారు ప్రతి రోజూ రెండు చిటికల పసుపు, చిటికెడు మెత్తటి ఉప్పు గోరువెచ్చని నీటిలో కలుపుని తాగడం వల్ల ఆయాసానికి చెక్ చెప్పొచ్చంటున్నారు వైద్యులు. పసుపులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఆయాసానికి కారణం అవుతున్న బ్యాక్టీరియ పని పడితే.. ఆ బ్యాక్టీరియా వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ కోయడంలో ఉప్ప లవణం అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు.
వేడి నీటిలో తొమ్మిది చుక్కల నిమ్మరసం, అర చెంచా తేనే కలుపుకుని ప్రతి రోజూ పరగడుపున క్రమం తప్పకుండా తాగడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, వాటిలో ఆయాసం నుంచి ఉపశమనం పొందడం కూడా ఒకటని నిపుణులు వివరిస్తున్నారు. నిమ్మరసంలో ఉంటే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లను రక్తంలో త్వరగా కలిసేలా తేనే చేస్తుంది. తద్వారా మన శరీరంలో శక్తి స్థాయిలు అంతగా పడకుండా నిమ్మరసం చూసుకుంటుందని, దాని వల్ల వెంటనే ఆయాసం రాకుండా ఉంటుందంటున్నారు.
దీంతో పాటుగానే అధికంగా ఆయాసం వస్తున్నప్పుడు.. వంద గ్రాముల వామును తీసుకుని.. దానిని వేడి చేసి పల్చనిి గుడ్డలో మూటగట్టి వీపు, ఛాతి, గొంతుపైన కాపడం పెడుతుంటే లోపల ఉన్న ఇన్ఫెక్షన్ కరిగి బయటకు వచ్చేస్తుందని, తద్వారా శ్వాస బాగా తీసుకోవడం జరిగి ఆయాసం రాదని చెప్తున్నారు. అదే విధంగా కాస్తంత వామును దోరగా వేయించి.. దానిని పల్చటి గుడ్డలో కట్టుకుని దాని వాసన పీల్చడం ద్వారా ఊపిరితిత్తులు, గొంతులోని ఇన్ఫెక్షన్‌లకు చెక్ చెప్పచ్చొని నిపుణులు వివరిస్తున్నారు. వీటితో పాటు మన ఆహారంలో లేత ముల్లంగి, వెలగపండు, తేనే, వెల్లుల్లి వంటి వాటిని చేర్చుకోవడం కూడా ఆయాసాన్ని తగ్గించడంలో ఉపయోజడతాయని చెప్తున్నారు.
వీటితో పాటుగా ఆయానం తగ్గించుకోవాలని భావించే వారు మినుములు, చేప, సొరకాయ, దుంపకూరలు, బచ్చలికూర, నూనె పదార్థాలు, పుట్టలి పదార్థాలు, ఐస్ క్రీములు, కూల్ డ్రింక్‌లు, చన్నీటి స్నానం, మంచులో తిరగడం, చల్లగాలిలో ఉండటం మానుకోవడం మంచిదని చెప్తున్నారు.